అటవీ అమరుడికి జాతీయ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

అటవీ అమరుడికి జాతీయ గుర్తింపు

Oct 25 2026 12:35 AM | Updated on Oct 25 2026 12:35 AM

● గత ఆగస్టులో విధి నిర్వహణలో మృతి చెందిన ఎఫ్‌బీఓ ● బానోతు నవీన్‌కు ‘ఫ్రంట్‌లైన్‌ స్టాఫ్‌ ప్రొటెక్షన్‌’ పురస్కారం

ఢిల్లీలో ప్రదానం

నవీన్‌ సేవలు చిరస్మరణీయం

● గత ఆగస్టులో విధి నిర్వహణలో మృతి చెందిన ఎఫ్‌బీఓ ● బానోతు నవీన్‌కు ‘ఫ్రంట్‌లైన్‌ స్టాఫ్‌ ప్రొటెక్షన్‌’ పురస్కారం

చుంచుపల్లి: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బీట్‌ ఆఫీసర్‌ బానోత్‌ నవీన్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. పాల్వంచ అటవీ రేంజ్‌ పరిధిలోని ముసలిమడుగు సెక్షన్‌ చెరువుసింగారం వెస్ట్‌ బీట్‌లో పనిచేస్తున్న నవీన్‌కు అడవిలో వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్‌ తీగలను అమర్చి నట్లు సమాచారం అందింది. దీంతో తోటి సిబ్బందితో కలిసి కృష్ణసాగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోని నకిరిపేట అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అక్రమంగా అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. తాను ప్రాణా లు కోల్పోతున్న తోటి సిబ్బందిని ప్రమాదం గురించి హెచ్చరించాడు. ఈ ఘటన గత ఆగస్టు 11న రాత్రి జరిగింది.

పాల్వంచ అర్బన్‌ పార్క్‌లో విగ్రహం

నవీన్‌ మరణం ఆయన కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. అతని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కు రూ.30 లక్షలు, సెంట్రల్‌ ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశాయి. జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ద్వారా రూ.6 లక్షల వరకు, విద్యుత్‌శాఖ నుంచి మరో రూ.8 లక్షల వరకు త్వరలో అందించనున్నట్లు సమాచారం. పాల్వంచ అర్బన్‌ పార్కులో నవీన్‌ విగ్రహం పెట్టేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ నవీన్‌ సేవలను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ గుర్తించింది. ‘ఫ్రంట్‌లైన్‌ స్టాఫ్‌–ప్రొటెక్షన్‌ అండ్‌ యాంటీ–పోచింగ్‌ విభాగంలో ఆయనను మరణానంతర పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ విభాగంలో తెలంగాణ నుంచి నవీన్‌ ఒక్కరే ఎంపికయ్యాడు. త్వరలోనే ఢిల్లీలో ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు.

వన్యప్రాణుల సంరక్షణలో బానోత్‌ నవీన్‌ త్యాగం చిరస్మరణీయం. ఆయన సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం గర్వకారణం. అటవీ ప్రాంతాల్లో అక్రమ వేటను అరికట్టడంతోపాటు సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

–సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌, జిల్లా అటవీ శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement