అశ్వాపురం: ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు పెంపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మండల పరిధి లోని కుమ్మరిగూడెంలో దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు పెంచే పనులను విజయదశమిరోజు ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. టీఎంసీ నీరు నిల్వ ఉండేలా రూ.1.30 కోట్లు వెచ్చించి ఇసుక బస్తాలతో ఆనకట్ట ఎత్తు పెంచుతున్నారు. శనివారం పనుల ను జలవనరుల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి పరి శీలించారు. గోదావరిలో వరద పెరిగినా ఇబ్బంది లేకుండా ఆధునిక గేబీన్ టెక్నాలజీతో ఆనకట్ట ఎత్తు పెంచుతున్నామని తెలిపారు. ఎస్‌ఈ మహేశ్వరరావు, ఈఈలు రాంబాబు, వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాస్, ఏఈలు పాల్గొన్నారు.


