ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి

Oct 25 2026 12:35 AM | Updated on Oct 25 2026 12:35 AM

పాల్వంచ/పాల్వంచరూరల్‌: గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజ లకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌ సూచించారు. శనివారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య కనీసం 20 ఇళ్లను సందర్శించి కుష్ఠు వ్యాధి సర్వే చేపట్టా లని సిబ్బందికి సూచించారు. జ్వరం బారిన పడిన ప్రతి ఒక్కరికీ ఆర్‌డీటీ లేదా మైక్రోస్కోపీ ద్వారా మలేరియా, టీబీ పరీక్షలు నిర్వహించాలన్నారు. మీజిల్స్‌–రుబెల్లా టీకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. 2030 నాటికి టీబీ రహిత సమాజ లక్ష్యసాధనకు కృషి చేయాలని చెప్పారు. డీటీసీఓ డాక్టర్‌ ప్రసాద్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీధర్‌, పీఓ డీటీ డాక్టర్‌ రాందాస్‌, ఏఎంఓ రాందాస్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement