ఇల్లెందురూరల్: ఇల్లెందు మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీ పరిధి కట్టుగూడెం గ్రామానికి చెందిన జానపద కళాకారిణి తూర్పా టి సాలమ్మ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభ పురస్కారానికి ఎంపికైంది. 2026 సంవత్సరానికి విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం ద్వారా ప్రతిభా పురస్కారాలకు ఎంపికై న వారి జాబితాను ఇన్‌చార్జ్ శ్రీకాంత్ గురువారం ప్రకటించారు. ఇందులో మారుమూల గ్రామానికి చెందిన సాలమ్మ జానపద కళారంగంలో అందించిన విశిష్ట సేవలకు పురస్కారానికి ఎంపికై ంది. హైదరాబాద్ తెలుగు విద్యాలయంలో శనివారం జరిగే సమావేశంలో పురస్కారం అందుకోనుండగా, రేపల్లెవాడ సర్పంచ్ బానోత్ శారద, తదితరులు అభినందించారు.
హాజరు పెంచేలా
వినూత్న కార్యక్రమం
అశ్వారావుపేటరూరల్: విద్యార్థులు క్రమం తప్పక వచ్చేలా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురంజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం షాహీనా బేగం, ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు వారి పుట్టిన రోజుకు ముందు రెండు నెలలు క్రమం తప్పక హాజరైతే వేడుక నిర్వహిస్తామని ప్రకటించారు. ఈక్రమాన గురువారం ఓ విద్యార్థి జన్మదిన వేడుకలను ఉపాధ్యాయుల ఖర్చుతో నిర్వహించడం విశేషం.


