పథకాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Oct 2 2026 12:22 AM | Updated on Oct 2 2026 12:22 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని కొత్తగూడెం క్లబ్‌లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విద్యాచందన పాల్గొనగా, డీఆర్‌ఓ పద్మావతి, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ అనూషతో కలిసి వయో వృద్ధుల సంక్షేమం, చట్టాలపై రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ విద్యాచందన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆతర్వాత స్వచ్ఛంద సంస్థల సభ్యులు రావి వెంకటయ్య, చాగంటి కృష్ణమూర్తి, వాసాల నాగమణి, సీతారామశాస్త్రి, రామయ్య, శంకర్‌, సుజాత, సరోజ సుబ్బారావును సన్మానించారు. అలాగే, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ దినేష్‌ ఆధ్వర్యాన వైద్యపరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, సురేష్‌, భూషణ్‌రావు, పీఎస్‌ఎన్‌.రెడ్డి, పాప య్య, వెంకటేశ్వరరావు, కృష్ణయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement