సూపర్‌బజార్(కొత్తగూడెం): రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్లను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన గురువారం ఎంపిక చేశారు. కొత్తగూడెంలోని సీఈఆర్ క్లబ్‌లో అండర్–14, 17 బాలబాలికలకు జట్ల ఎంపిక పోటీలు నిర్వహించగా 180మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబర్చిన వారితో జట్లను ఎంపిక చేశారు. అండర్ – 14 బాలుర విభాగంలో జి.నిహార్, బి.అభిరామ్, ఎస్.కే.ఫిరోజ్‌బాబా, బి.అఖిల్, ఏ.దేవానంద్, సీహెచ్.ఉమేష్‌చరణ్, కె.దీక్షిత్, బి.హేమచంద్ర, సునీత్ జట్, బాలికల జట్టుకు కె.అక్షిత, కరీనా, కె.ప్రవీణలక్ష్మి, ఎస్.శ్రీచందన, పి.నాగలలిత, డి.మానస, బి.నిత్య, హనీఫా, వై.ప్రసన్నకుమారి ఎంపికయ్యారు. ఇక అండర్ – 17 బాలుర విభాగంలో బి.సైదులు, బి.రాకేష్, జె.సన్నీ, తరుణ్, బి.చరణ్, ఇ.కిషోర్, బి.అరుణ్, బి.చరణ్, జె.నిఖిల్, బాలికల విభాగంలో కె.పోజి, కె.త్రిలోచన, బి.సునీత, ఎస్.కే.ఆశాబీ, బి.నీలో హర్షిత, ఎస్.కే.మౌలానాబీ, ఎస్.రక్షిత, ఏ.అక్షయ, ఆర్.గీతా హర్షిణి ఎంపికయ్యారు. ఇతర విభాగాలకు ఎస్‌కే.సాధిక్, బి.ధనుష్, జి.కార్తికేయ, ఎస్.కే.తనీఫ్, కె.సందీప్, బి.రాజేష్, బి.సాయి చరణ్ ఎంపికయ్యారు. జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి బావుసింగ్, పీడీ మంజీలాల్ పీడీ, రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కాశీ హుస్సేన్, ఐటీడీఏ స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాల్‌రావుతో పాటు వెంకటనారాయణ, వై.జంపన్న, ఎస్.వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
● భద్రాచలం అర్బన్/దుమ్ముగూడెం: భద్రాచలం ఐటీడీఏ పరిధి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పలువురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో 59 మంది రాష్ట్రస్థాయికి అర్హత సాధించారని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. విద్యార్థులతో పాటు డిప్యూటీ డైరెక్టర్ చందన, పీడీలు, పీఈటీలను పీఓ అభినందించారు. కాగా, దుమ్ముగూడెం మండలంలోని కొత్తపల్లి బాలుర ఆశ్రమ పాఠశాల నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. అండర్– 14 విభాగం హాకీ జట్టుకు జస్వంత్, జీవన్‌బాబు, యాకూబ్, గోపీచంద్ ఎంపిక కాగా, హెచ్‌ఎం నరసింహారావు, పీడీ హరికృష్ణ, పీఈటీ గంగరాజు, వార్డెన్ నాగేశ్వరరావు, స్టాఫ్ సెక్రటరీ శివప్రసాద్, ఉపాధ్యాయులు అభినందించారు.


