అధిక సంఖ్యలో టైర్లతో బరువు యంత్రం లోడుతో వెళ్తున్న ఓ లారీని స్థానికులు ఆసక్తిగా
పరిశీలించారు. ఏపీలోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌లోని ఓ ఫ్యాక్టరీకి అవసరమైన భారీ యంత్రాన్ని తరలిస్తున్నారు. ఈ లారీకి ముందు, వెనుక రెండు ఎస్కార్ట్ కార్లతోపాటు విద్యుత్ వైర్లు, బోర్డులు, ఆర్చీలను తప్పించేందుకు మరో పది మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఈ భారీ
వాహనాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. అశ్వారావుపేట జాతీయ రహదారిపై
ఈ వాహనం కనిపించగా, దానికి 106 టైర్లు ఉన్నాయి. – అశ్వారావుపేట రూరల్


