10 నుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

10 నుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

Sep 26 2026 12:44 AM | Updated on Sep 26 2026 12:44 AM

అశ్వారావుపేటరూరల్‌: అశ్వారావుపేటలో వచ్చే నెల 10 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి బాలికల అండర్‌–20 కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వివరాలు వెల్లడించారు. పోటీలు మూడు రోజులపాటు రాత్రి, పగలు జరుగుతాయని అన్నారు. 33 జిల్లాల నుంచి 34 జట్లు(హైదారాబాద్‌ నుంచి రెండు జట్లు) పాల్గొంటాయన్నారు. 476 మంది క్రీడాకారులు హాజరు కానున్నారని, వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయస్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు. అనంతరం ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జూపల్లి రమేష్‌బాబు, ఆత్మ కమిటీ చైర్మన్‌ ఎస్‌ వీరభద్రరావు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement