పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన

Sep 25 2026 12:23 AM | Updated on Sep 25 2026 12:23 AM

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనక దుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణపుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు జరిపారు. అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్‌ శర్మ పాల్గొన్నారు.

గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు

స్పాట్‌ కౌన్సెలింగ్‌

భద్రాచలంటౌన్‌: ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5నుంచి 9వ తరగతి వరకు, జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 26న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ తెలిపారు. అర్హత కలిగిన గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు ఉదయం 10గంటలకు ప్రవేశం కోరుకునే పాఠశాల, కళాశాలలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, రెండు సెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు. బాలురకు దమ్మపేట, కిన్నెరసాని, గుండాల, సింగరేణి, తిరుమలాయపాలెం, కృష్ణసాగర్‌ గురుకులాల్లో, బాలికలకు భద్రాచలం, సుదిమళ్ల, మణుగూరు, కొత్తగూడెం, వైరా, అంకంపాలెం, అన్నపురెడ్డిపల్లి కళాశాలల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

రెడ్‌క్రాస్‌ ఎన్నికలకు

31 నామినేషన్లు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం)/భద్రాచలం/చుంచుపల్లి: రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల గడువు గురువారంతో ముగియగా మొత్తం 31 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారి పర్యవేక్షణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగింది. తదుపరి నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన తదితర ప్రక్రియలు నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం జరగనున్నాయి. వచ్చే నెల 4న ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ మేరకు ఎన్నికల అధికారి, సీపీఓ జె.సునీత వివరాలు వెల్లడించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల

భద్రతపై ఆడిట్‌

భద్రాచలంఅర్బన్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెల రోజుల్లో ఫైర్‌, ఎలక్ట్రికల్‌, స్ట్రక్చరల్‌ ఆడిట్లు పూర్తి చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ప్రకటించారు. దీంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోనూ ఫైర్‌, ఎలక్ట్రికల్‌, భవన భద్రతా ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఇటీవల ‘సాక్షి’ పరిశీలనలో ఇక్కడి ఎస్‌ఎన్‌సీయూలో స్మోక్‌ డిటెక్టర్లు, ఆటోమేటిక్‌ స్ప్రింక్లర్లు, ఫైర్‌ పైప్‌లైన్‌ లేనట్లు వెల్లడైంది. మాన్యువల్‌ అలారం, ఫైర్‌ ఎగ్జిట్‌, నాలుగు అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండగా, ఫైర్‌ ఎన్‌ఓసీ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ చైర్మన్‌గా మల్టీ డిపార్ట్‌మెంటల్‌ కమిటీల ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

మెడికల్‌ పీజీ సీట్లపై ఆశలు

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌ విభాగాల్లో నాలుగు చొప్పున 12 పీజీ సీట్ల మంజూరుపై ఆస్పత్రి అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే జనరల్‌ సర్జరీ, గైనకాలజీ విభాగాల్లో ఎన్‌ఎంసీ బృందం తనిఖీలు పూర్తవగా, తాజాగా పీడియాట్రిక్స్‌ విభాగంలో గురువారం తనిఖీలు చేపట్టింది. చైన్నెలోని ప్రభుత్వ కిల్‌పాక్‌ మెడికల్‌ కాలేజీ పీడియాట్రిక్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎజిలరసు రామలింగం ఆస్పత్రిని సందర్శించి వైద్యసేవలు, సిబ్బంది, బోధనా వసతులు, పరికరాలు, రికార్డులను పరిశీలించారు. మూడు విభాగాల్లో తనిఖీలు పూర్తికావడంతో ఎన్‌ఎంసీ నిర్ణయం కీలకం కానుంది. సూపరింటెండెంట్‌ రాజశేఖరరెడ్డి, పిల్లల వైద్యులు విజయరావు, క్రాపా విజయ్‌ పాల్గొన్నారు.

సింగరేణిలో క్రీడా పోటీలు

రుద్రంపూర్‌: సింగరేణి కొత్తగూడెం ఏరియాలో గురువారం రీజియన్‌ స్థాయి బాడీ బిల్డింగ్‌ , వెయిట్‌ లిఫ్టింగ్‌, పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు నిర్వహించారు. కొత్తగూడెం, కార్పొరేట్‌, సత్తుపల్లి ఏరియా కార్మికులు పాల్గొనగా, ప్రకాశం స్టేడియంలో ప్రారంభించారు. ఏరియా పర్సనల్‌ మేనేజర్‌ ఎల్‌. తిరుపతి, ఇతర డీవైపీఎం జి.హరీష్‌, సూపర్‌వైజర్‌ పాసినెట్‌, ఏఐటీయూసీ నాయకులు కే.రాములు, సముద్రాల సుదాకర్‌, సకినాల సమ్మయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement