ప్రాధాన్యతా రంగాలకు రుణాలు | - | Sakshi
Sakshi News home page

ప్రాధాన్యతా రంగాలకు రుణాలు

Sep 25 2026 12:23 AM | Updated on Sep 25 2026 12:23 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరు వేగవంతం చేయాలని డీఆర్‌ఓ పద్మావతి ఆదేశించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి త్రైమాసిక జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) సమావేశం గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రామిరెడ్డి, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏజీఎం చిరంజీవి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ నాగరాజు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. ప్రాధాన్యతా రంగాల రుణాల లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ 2026 జూన్‌ 30వ తేదీ నాటికి జిల్లాలో రూ.5,702.78 కోట్ల వార్షిక లక్ష్యానికి రూ 1,578.08 కోట్లు మంజూరు చేశామని, 27.67 శాతం నమోదైందని తెలిపారు. వ్యవసాయ రంగానికి రూ.4,591.84 కోట్ల లక్ష్యానికి రూ.1,148.87 కోట్లు (25.01 శాతం) మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో రూ.888.98 కోట్ల లక్ష్యానికి రూ 403.1 కోట్లు (45.34 శాతం), విద్యా రుణాలు రూ 21.4 కోట్ల లక్ష్యానికి రూ.3.44కోట్లు (16.07 శాతం), గృహ రుణాలు రూ.35 కోట్ల లక్ష్యానికి రూ.5.08 కోట్లు (14.51 శాతం) మంజూరు చేసినట్లు వివరించారు. పీఏం సూర్య ఘర్‌ పథకంలో రూ.7.06 కోట్ల లక్ష్యానికి 6.76 కోట్ల(95.75 శాతం) రుణాలు ఇచ్చినట్టు తెలిపారు. ఇతర విభాగాల్లో రూ.153.5 కోట్ల లక్ష్యానికి రూ 10.82 కోట్లు మంజూరు చేసి 7.05 శాతం నమోదు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మూడు పోస్టాఫీస్‌లు వేరే పోస్టాఫీస్‌లలో విలీనం అవుతున్నాయని తెలిపారు. స్ట్రీట్‌ వెండర్లకు రుణం రూ.10 వేల నుంచి రూ. 15 వేలకు పెంచామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ డీఆర్‌డీఏ నీలేష్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, పశుసంవర్ధక శాఖ అధికారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

డీఆర్‌ఓ పద్మావతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement