హేమాచలుడి సేవలో ఎస్పీ రోహిత్‌ | - | Sakshi
Sakshi News home page

హేమాచలుడి సేవలో ఎస్పీ రోహిత్‌

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు శనివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు ముక్కామల రాజశేఖర్‌శర్మ, వెంకటనారాయణ శర్మ వారికి స్వాగతం పలకగా, స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎస్పీకి అర్చకులు స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు, వేదాశీర్వచనం అందజేశారు.

4న రెడ్‌క్రాస్‌ ఎన్నికలు

భద్రాచలంటౌన్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా బ్రాంచ్‌ పాలకవర్గ సభ్యుల ఎన్నిక అక్టోబర్‌ 4న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ వెల్లడించారు. 15 మంది జిల్లా కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనుండగా, పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ రుసుం రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement