సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రస్తుత ఎల్‌నినో పరి స్థితుల్లో పొద్దుతిరుగుడు సాగుతో రైతులు మెరుగు ఆదాయం పొందవచ్చని వరంగల్ ఆర్‌ఏఆర్‌ఎస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎం శ్రీధర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఐకార్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్ సహకారంతో గిరి జన ఉప ప్రణాళిక ప్రాజెక్టులో భాగంగా కేవీకే ప్రాంగణంలో శనివారం కిసాన్ మేళా, పొద్దుతిరుగుడు హైబ్రిడ్ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలని సూచించా రు. హైదరాబాద్ ఐకార్ ప్రిన్సిపల్ సైంటిస్టులు డాక్టర్ జి.సురేష్, జీడీ సతీష్‌కుమార్‌లు మాట్లాడు తూ రైతు ఉత్పత్తిసంఘాల ద్వారా నూనెగింజలను సమష్టిగా ఉత్పత్తి చేయాలని సూచించారు. ఐకార్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ హెచ్‌పి మీనా, జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు కూడా మాట్లాడారు. సుజాతనగర్ తెలంగాణ గ్రామీణవికాస్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ జి సునీల్ కుమార్, శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్ ఓం ప్రకాష్, భరత్ పాల్గొన్నారు.
వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రం
డైరెక్టర్ శ్రీధర్


