శ్రీకనకదుర్గమ్మతల్లికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

శ్రీకనకదుర్గమ్మతల్లికి విశేష పూజలు

Aug 24 2026 12:25 AM | Updated on Aug 24 2026 12:25 AM

పాల్వంచరూరల్‌: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ ఆలయానికి పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

విద్యుత్‌ సరఫరా నిలిచి భక్తుల పాట్లు

శ్రావణ మాసం కావడంతో ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. జనరేట్‌ సౌకర్యం ఉన్నా ఆన్‌చేసే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈఓ స్పందించి విద్యుత్‌ సరఫరా నిలిచిపోగానే జనరేటర్‌ ఆన్‌చేసేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

నేడు ప్రజావాణి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ప్రజా వాణికి అధికారులు సకాలంలో హాజరు కావా లని కలెక్టర్‌ అంకిత్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక దరఖాస్తుల ను అందజేయాలని సూచించారు. భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు.

గిరిజన దర్బార్‌..

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్‌ కార్యక్రమానికి అన్నిశాఖల ఐటీడీఏ యూనిట్‌ అధికారులు సకాలంలో హాజరుకా వాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజ నులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పేర్కొన్నారు.

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో..

భద్రాచలం డివిజన్‌ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

నేడు, రేపు ఎస్టీ కమిషన్‌ సభ్యుడి పర్యటన

అశ్వాపురం/భద్రాచలంటౌన్‌: జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ ఈ నెల 24, 25 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తారని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలం కూనారంలో రైతులతో సమావేశమవుతారు. అనంతరం అశ్వాపురం హెవీ వాటర్‌ బోర్డు కాన్ఫరెన్స్‌ హాల్లో అధికారులు, గిరిజన ఉద్యోగులతో సమావేశమై సమస్యలపై చర్చించనున్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో గిరిజన పెండింగ్‌ కేసులపై అధికారులతో సమీక్ష జరుపుతారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని పీఓ సూచించారు.

ప్రశాంతంగా

టెక్నీషియన్‌ రాతపరీక్ష

రుద్రంపూర్‌: సింగరేణిలో జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి ఆదివారం కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు. యాజమాన్యం ఈ పోస్టులను ఇంటర్నల్‌ అభ్యర్థులతో భర్తీకి చర్యలు చేపట్టింది. పరీక్ష కేంద్రాన్ని పర్సనల్‌ (రిక్రూట్‌మెంట్‌ సెల్‌) విభాగం జీఎం ఏజే మురళీధర్‌ రావు పర్యవేక్షించారు. సింగరేణి సెక్యూరిటీ, విజిలెన్స్‌, రిక్రూట్‌మెంట్‌ సెల్‌ విభాగాల ఆధ్వర్యంలో పారదర్శకంగా పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement