ములకలపల్లి: నాయకపోడు గిరిజన చిత్రకళ సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేక చౌపాల్ (రచ్చబండ) కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ హస్తకళల సేవా కేంద్రం, సహాయ సంచాలకులు దివ్యారావు తెలిపారు. కమలాపురంలో ఆదివా రం ఏర్పాటు చేసిన పెయింటింగ్ చౌపాల్‌లో ఆమె మాట్లాడారు. గ్రామీణస్థాయి కళాకారులను గుర్తించి, ప్రోత్సహిస్తామని చెప్పారు. పథకాలు, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ నమోదు, మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామని అన్నారు. స్థానిక కళాకారిణి చిటికె కమలాకుమారి చేసిన నాయకపోడు చిత్రాలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయని అభినందించారు. కార్యక్రమంలో హస్తకళల ప్రోత్సాహక అధికారి ప్రవీణ్, ఉపసర్పంచ్ లక్ష్మీకుమారి, గ్రామపెద్దలు జక్కా రాంబాబు, వాసం రమేష్, నాయకపోడు కళాకారులు కమలా కుమారి, ఊరబెద్ది వెంకన్న పాల్గొన్నారు.


