రైతు సంఘాల నాయకులు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రైతు సంఘాల నాయకులు అరెస్ట్‌

Aug 11 2026 12:24 AM | Updated on Aug 11 2026 12:24 AM

రుద్రంపూర్‌: కొత్తగూడెం పట్టణంలో సోమవారం జైల్‌భరో కార్యక్రమం నిర్వహించగా, ఈ సందర్భంగా పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘాల రాష్ట్ర బాధ్యులు పోతినేని సుదర్శన్‌రావు, ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మి కుల హక్కులపై మోదీ ప్రభుత్వం దాడి చేస్తోందని ఆరోపించారు. దేశ వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లను రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, వీబీ జీరాంజీ చట్టాన్ని రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, నరాటి ప్రసాద్‌, సీతారామయ్య, గోపాలరావు, అన్నవరపు సత్యనారాయణ, కెచ్చర్ల రంగారెడ్డి, పూర్ణచందర్‌ రావు, జలీల్‌, చంద్రారెడ్డి, బ్రహ్మాచారి పాల్గొన్నారు.

కొండచిలువ కలకలం

బూర్గంపాడు: మండలంలోని తాళ్లగొమ్మూరు గ్రామంలో సోమవారం కొండచిలువ కలకలం రేపింది. స్థానిక మసీదులో కొండచిలువ కని పించడంతో భయాందోళనకు గురైన స్థానికులు స్నేక్‌ క్యాచర్‌ శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఆయన చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని, అనంతరం సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

తల్లీ బిడ్డలను వేరుచేసిన పంచాయితీ!

పోలీసులను ఆశ్రయించిన అమ్మమ్మ

మణుగూరు టౌన్‌: పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీ తల్లీబిడ్డలను వేరుచేసేలా ఉండటంతో ఓ మహిళ తన మనవళ్లతో కలిసి న్యా యం కోసం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు కవిత కథనం ప్రకారం... కవిత కూతురు హేమలతకు వివాహం జరగ్గా ఇద్దరు మగపిల్లలున్నారు. ఏడు నెలల క్రితం అల్లుడు మృతి చెందాడు. ఈ క్రమంలో హేమలతకు ముత్యాలమ్మనగర్‌కి చెందిన రామకృష్ణతో ఉన్న పరిచయంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసి హేమలతను మందలించింది. కాగా, ముత్యాలమ్మనగర్‌ గ్రామపెద్దలు, సర్పంచ్‌లు సోమవారం పంచా యితీ పెట్టి హేమలత, రామకృష్ణలకు వివా హం చేయాలని నిర్ణయించారు. పిల్లలను తానే సాకాలని ఒత్తిడి చేస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది.

కనీస రక్షణ చర్యలు శూన్యం!

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అభివృద్ధి పనుల్లోనిర్మాణ సంస్థ ప్రతినిధులు కనీస రక్షణ చర్యలు పాటించటం లేదు. కార్మికుల ప్రాణాలను గాలికొదిలేసి పనులను చేయిస్తున్నారు. సోమవారం ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంపై ఐరన్‌ షెడ్‌ను తొలగించే క్రమంలో ఓ కార్మికుడిని జేసీబీ యంత్రంపై ఉంచి పని చేయించారు. హెల్మెట్‌ ధరించకుండా, రోప్‌ ఆధారం లేకుండా కార్మికులు ఐరన్‌ షెడ్‌ను తొలగించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాంట్రాక్టర్‌ భద్రతా చర్యలు తీసుకునేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

టిప్పర్‌, ట్రాక్టర్‌ సీజ్‌

అశ్వారావుపేటరూరల్‌: అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ టిప్పర్‌, ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ యయా తీ రాజు కథనం ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి గోదావరి ర్యాంప్‌ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా టిప్పర్‌లో దమ్మపేట మండలం అంకంపాలేనికి తరలిస్తుండగా మార్గమధ్యలోని అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి శివారులోవాహనాన్ని పట్టుకున్నా రు. అలాగే మండలంలోని అనంతారం గ్రామ శివారులో వాగు నుంచి అనుమతి లేకుండా ట్రా క్టర్‌లో ఇసుక అశ్వారావుపేటకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్లు, యజ మానులతోపాటు ఇసుకవినియోగదారులపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement