ఖమ్మంలో సౌత్ ఏషియా
ఖమ్మం స్పోర్ట్స్: ప్రతిష్టాత్మక 17వ సౌత్ ఏషియాన్ బాడీ బిల్డింగ్ అండ్ బెస్ట్ ఫిజిక్ చాంపియన్‌షిప్ టోర్నీ నిర్వహణకు ఖమ్మంను వేదికగా ఖరారు చేశారు. వచ్చే ఏడాది జూలై, ఆగస్టులో ఈ టోర్నీ జరగనుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. ఖమ్మంలో టోర్నీ నిర్వహించాలని సోమవారం ఢిల్లీలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయాను కలిసి వినతిపత్రం అందించగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. దేశ రాజధానులకే పరిమితమయ్యే అంతర్జాతీయ స్థాయి పోటీలు ఖమ్మంలో జరగనుండగా.. భారత్, భూటాన్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల నుంచి 150 మంది క్రీడాకారులు, 300 మంది టెక్నికల్ అధికారులు హాజరవుతారని ఎంపీ తెలిపారు. సౌత్ ఏషియాన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ేఫెడరేషన్ జనరల్ బాడీ జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్నన్న నిర్ణయాన్ని జాతీయ అధ్యక్షుడు స్వామి రమేష్ తన దృష్టికి తీసుకురాగా కేంద్ర క్రీడల మంత్రికి వివరించడంతో సానుకూలంగా స్పందించారని వివరించారు.
‘పీఎం – సేతు’ హబ్ కేటాయించాలని వినతి
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాకు ‘పీఎం–సేతు’ హబ్ కేటాయించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని ఎంపీ రఘురాంరెడ్డి కోరారు. పరిశ్రమలు కేంద్రీకృతమైన ప్రాంతాలకే ఐటీఐల ఆధునీకరణ పరిమితం చేయకుండా, గ్రామీణ, గిరిజన ప్రాంతాలకూ ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం ఐటీఐని హబ్‌గా గుర్తించి, కొత్తగూడెం తదితర ఐటీఐలను అనుసంధానించాలని కోరారు. అంతేకాక ఖమ్మంలో మిరప ప్రాసెసింగ్, ఫుడ్–ప్రాసెసింగ్ స్కిల్ సెంటర్ల ఏర్పాటు, కొత్తగూడెంలో ట్రైబల్ స్కిల్ అండ్ ఎనర్జీ – మైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడమే కాక ఈవీలు, సోలార్ ఎనర్జీ, డ్రోన్లు, రోబోటిక్స్ కోర్సులు ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీ వినతితో కేంద్ర క్రీడల
మంత్రి సానుకూల స్పందన


