అశ్వాపురం: మండలంలో గోదావరి వరదతో శుక్రవారం గోదావరి పరీవాహక ప్రాంతాలైన రాంనగర్–బట్టీగుంపు, అమ్మగారిపల్లి–అమెర్ద, చింతిర్యాల–చింతిర్యాల కాలనీ, ఇరవెండి–నెల్లిపాక రహదారులపై వరదనీరు చేరి రాకపోకలు నిలిచాయి. తహసీల్దార్ సూర్యప్రకాష్, ఎంపీడీఓ ముత్యాలరావు, సీఐ ఎల్లయ్య గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు మిట్టగూడెం, సీతారాంపురం జెడ్పీఎస్‌ఎస్ పాఠశాలలు, అశ్వాపురంలో ఎస్‌కేటీ, ఓం శక్తి పంక్షన్‌హాల్, బీసీ హాస్టల్‌లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.


