వైభవంగా పంచామృతాభిషేకం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా పంచామృతాభిషేకం

Aug 1 2026 12:34 AM | Updated on Aug 1 2026 12:34 AM

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

17 లోగా ‘ఓపెన్‌’ పరీక్షల ఫీజు చెల్లించాలి

కొత్తగూడెంఅర్బన్‌: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ శుక్రవారం విడుదలైందని డీఈఓ, డి.వాసంతి, ఏసీజీఈ ఎస్‌.మాధవరావు, ఉమ్మ డి జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ కూరపాటి మంగపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి అభ్యర్థులు సబ్జెక్ట్‌కు రూ.100, ఇంటర్‌ అభ్యర్థులు సబ్జెక్టుకు రూ.150 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచి 17వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.

నవోదయ ప్రవేశాల గడువు పొడిగింపు

కరకగూడెం: జవహర్‌ నవోదయ విద్యాలయలో 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంపిక పరీక్ష ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించినట్లు జవహర్‌ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ రత్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31తో గడువు ముగియగా, ఉన్నతాధికారులు పొడిగించారని పేర్కొన్నారు.

ఓడి చెరువులో

20 కేజీల చేప

అశ్వారావుపేటరూరల్‌: మండలంలోని తిరుమలకుంట గ్రామ శివారు ఓడి చెరువులో శుక్రవారం మత్స్యకారులు చేపల వేట సాగించారు. దీంతో 20 కేజీల బరువు ఉన్న అరుదైన చేప వలకు చిక్కింది. కొనుగోలుకు పలువురు పోటీపడగా, చివరకు రూ.2500కు అమ్ముడైంది.

యూడైస్‌ను పరిశీలించాలి

జిల్లా విద్యాధికారి వాసంతి

కొత్తగూడెంఅర్బన్‌: కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు యూడైస్‌ వివరాలను పరిశీలించాలని జిల్లా విద్యాధికారి డి.వాసంతి తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం ఆనందఖని ఉన్నత పాఠశాలలోని జిల్లా ట్రైనింగ్‌ సెంటర్‌లో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆమె పీజీఐ ర్యాంకింగ్‌పై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు. గత సంవత్సరంలో జిల్లా ర్యాంకింగ్‌ చాలా తక్కువగా ఉందని, మెరుగుపరచుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు అన్నింటిని నమోదు చేయాలని సూచించారు. సెక్టోరియల్‌ అధికారులు మాధవరావు, సతీష్‌ కుమార్‌, జానకి, జిల్లా సైన్స్‌ అధికారి బి.సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

బియ్యం నిల్వల పరిశీలన

పాల్వంచరరూల్‌: గిరిజన సహకార సంస్థ బ్రాంచి కార్యాలయ సముదాయంలోని గోదా ముల్లో బియ్యం నిల్వలను జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ప్రేమ్‌కుమార్‌ శుక్రవారం తనిఖీ చేశారు. సన్నబియ్యం నిల్వలతోపాటు దొడ్డు బియ్యం నిల్వలను, స్టాక్‌ రికార్డులను పరిశీలించారు. గోదాం ఇన్‌చార్జి రాము ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement