సూపర్‌బజార్(కొత్తగూడెం): భూ సమస్య పరిష్కారం కోసం అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఆదివాసీలు కలెక్టరేట్ ధర్నాచౌక్‌లో చేపట్టిన ఆత్మగౌరవ నిరవధిక నిరాహార దీక్ష గురువారం నాటికి నాలుగో రోజుకు చేరింది. కాగా, అందరూ ఉత్సాహంగా ఉగాది పండుగ జరుపుకుంటే తాము మాత్రం పిల్లా పాపలతో ఇలా ఆందోళన చేయాల్సి వచ్చిందంటూ ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం శోచనీయమని రామన్నగూడెం సర్పంచ్ మడకం నాగేశ్వరరావు అన్నారు. తమ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ఇచ్చిన హామీని ఇప్పటికై నా అమలు చేయాలని ఆయన కోరారు.


