నూతన తెలుగు సంవత్సరాదికి జిల్లా వాసులు ఘనంగా స్వాగతం పలికారు. పరాభవ నామ ఉగాదిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో గురువారం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులుదీరారు. స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేయగా, సాయంత్రం పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. పలువురు ఇళ్లలోనూ పూజలు చేసి, పిండివంటలు, షడ్రుచుల ఉగాది పచ్చడి తయారు చేసి బంధుమిత్రులను ఆహ్వానించి విందు భోజనాలు ఆరగించారు. పాల్వంచ కళాపరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. – నెట్‌వర్క్


