తెలంగాణ జట్టు బోణీ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ జట్టు బోణీ

Jan 9 2026 7:27 AM | Updated on Jan 9 2026 7:27 AM

తెలంగ

తెలంగాణ జట్టు బోణీ

బాధ్యత పెంచింది

రెండో రోజూ అదే జోరు

పినపాక: మండలంలోని ఏడూళ్ల బయ్యారంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి అండర్‌ –17 బాలుర కబడ్డీ పోటీలో తెలంగాణ జట్టు బోణీ చేసింది. రెండో రోజైన గురువారం తమిళనాడు – తెలంగాణ జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఆరు పాయింట్ల తేడాతో రాష్ట్ర జట్టు గెలుపొందింది. జట్టుకు సారథ్యం వహించిన దేవరాజ్‌ 20 రైడ్‌ పాయింట్లు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్‌ ప్రారంభంలో మౌరి టెక్‌, కంది చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు రాష్ట్ర జట్టుకు యూనిఫామ్‌, షూ అందజేశారు.

తలపడిన 20 జట్లు..

పోటీల రెండో రోజున మొత్తం 20 జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. పంజాబ్‌ – మధ్యప్రదేశ్‌ జట్లు పోటీ పడగా మధ్యప్రదేశ్‌, కేంద్రీయ విశ్వవిద్యాలయం – విద్యాభారతి జట్ల మధ్య జరిగిన పోటీలో విద్యా భారతి, చండీఘర్‌ – ఒడిశా జట్లలో ఒడిశా, ఏపీ – త్రిపుర జట్లు పోటీ పడగా ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరి – సీఐఎస్‌సీ జట్ల మధ్య జరిగిన పోటీలో పుదుచ్చేరి, తెలంగాణ – తమిళనాడు జట్లు పోటీ పడగా తెలంగాణ, కర్ణాటక – ఢిల్లీ జట్ల మధ్య జరిగిన పోటీలో కర్ణాటక, మహారాష్ట్ర – హిమాచల్‌ప్రదేశ్‌ జట్లు పోటీ పడగా మహారాష్ట్ర, రాజస్థాన్‌–ఉత్తరాఖండ్‌ జట్లు పోటీ పడగా రాజస్థాన్‌, హరియాణా – కేవీఎస్‌ జట్ల మధ్య జరిగిన పోటీలో హరియాణా, ఎన్‌వీఎస్‌ – మధ్యప్రదేశ్‌ జట్లు పోటీ పడగా మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌ – మణిపూర్‌ జట్లు పోటీ పడగా మణిపూర్‌, పశ్చిమ బెంగాల్‌ – సీబీఎస్‌ఈ జట్లు తలపడగా సీబీఎస్‌ఈ, గుజరాత్‌ – జమ్మూ కాశ్మీర్‌ జట్లలో గుజరాత్‌, కేరళ – సీబీఎస్‌ఈ వెల్ఫేర్‌ జట్లు పోటీ పడగా కేరళ, ఉత్తరప్రదేశ్‌ – ఛత్తీస్‌గఢ్‌ జట్లు పోటీ పడగా ఉత్తరప్రదేశ్‌, అసోం – విద్యాభారతి జట్లు తలపడగా విద్యాభారతి, పంజాబ్‌ – ఎన్‌వీఎస్‌ జట్ల మధ్య జరిగిన పోటీలో పంజాబ్‌ విజయం సాధించాయి. ఛత్తీస్‌గఢ్‌ – ఉత్తరప్రదేశ్‌ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో రెండు పాయింట్లు తేడాతో ఉత్తరప్రదేశ్‌, కేరళ – సీబీఎస్సీ వెల్ఫేర్‌ జట్ల మధ్య జరిగిన పోటీలో నాలుగు పాయింట్లు తేడాతో కేరళ విజయం సాధించాయి.

తెలంగాణ జట్టుకు సారధిగా ఉండడం బాధ్యతను మరింతగా పెంచింది. క్రీడాకారుల సమన్వయం, కోచ్‌ల సలహాలు, సూచనలతో రాష్ట్రాన్ని విజయ తీరాలకు చేర్చే లక్ష్యంతో పోరాడుతాం. మొదటి మ్యాచ్‌ గెలుపొందడం సంతోషాన్నిచ్చింది.

–దేవరాజ్‌, తెలంగాణ జట్టు కెప్టెన్‌

క్రీడాభిమానులు, గ్రామస్తులు కేరింతల నడుమ క్రీడలు ఆహ్లాద భరితంగా సాగుతున్నాయి. తొలిరోజు జార్ఖండ్‌పై ఏపీ జట్లు గెలుపొందగా, రెండో రోజు తమిళనాడుపై తెలంగాణ విజయం సాధించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ జట్టు రెండో రోజు త్రిపురపై 27 పాయింట్లు తేడాతో గెలుపొందింది. ఈ పోటీ నడుస్తుండగానే ఏపీకి చెందిన క్రీడాకారుడు స్వల్ప అస్వస్థతకు గురి కాగా వైద్యులు చికిత్స అందించి, ఫిజియోథెరపీ చేశారు.

తమిళనాడుపై గెలుపొందిన రాష్ట్ర జట్టు

తెలంగాణ జట్టు బోణీ1
1/2

తెలంగాణ జట్టు బోణీ

తెలంగాణ జట్టు బోణీ2
2/2

తెలంగాణ జట్టు బోణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement