పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
జిల్లాలో నేడు మంత్రి
పొంగులేటి పర్యటన
ఇల్లెందు/పినపాక: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఇల్లెందుకు చేరుకోనున్న మంత్రి.. రూ. 3.17 కోట్లతో నిర్మించే రోడ్లు, డ్రెయిన్లు, బ్రిడ్జిల పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో నూతన సర్పంచ్‌లను సన్మానిస్తారు. సాయంత్రం 4 గంటలకు పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం చేరుకుని జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను వీక్షిస్తారు. అనంతరం బయ్యారం క్రాస్‌రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌లో పినపాక నియోజకవర్గ నూతన సర్పంచ్‌లను సన్మానిస్తారు. ఈ మేరకు అధకారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రశాంతంగా టెట్
సూపర్‌బజార్(కొత్తగూడెం): సుజాతనగర్‌లోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన టెట్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. సెషన్ –1కు 100 మంది అభ్యర్థులను గాను 87 మంది, సెషన్–2కు 100 మందికి గాను 56 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. రెండు సెషన్లలోనూ ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు కొనసాగాయని తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని వివరించారు.
మందుల కొరత లేకుండా చూడాలి
డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్
చుంచుపల్లి: జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. గురువారం ఆయన ఫార్మసీ, నర్సింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవసరమైన మందుల ఇండెంట్‌ను ఈ – ఔషధీ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలన్నారు. కాలం చెల్లిన మందుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని, గడువుకు ముందే వాటిని వినియోగించేలా చూడాలని చెప్పారు. అనంతరం జిల్లా వ్యాక్సిన్ స్టోర్‌ను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో డాక్టర్ తేజస్వి, సిబ్బంది నాగభూషణం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
అధ్యాపకుడికి డాక్టరేట్
పాల్వంచరూరల్: పట్టుదలతో ఉన్నత చదువులు చదివి అధ్యాపకుడిగా ఉద్యోగం చేస్తున్న మండల వాసికి డాక్టరేట్ దక్కింది. మండలంలోని కొత్తసూరారం గ్రామానికి చెందిన గుగులోతు రాంజీ – కౌసల్య దంపతుల చిన్నకుమారుడు గుగులోతు సుధాకర్ పాండిచ్చేరిలోని జిప్‌మార్ విశ్వవిద్యాలయంలో మెడికల్ బయోకెమిస్ట్రీలో పీజీ పూర్తిచేశారు. ప్రస్తుతం కొత్తగూడెంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని మల్వంచల్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ను వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన


