క్రీడాభివృద్ధికి సహకరిస్తాం
సీఎం కప్ టార్చ్ ర్యాలీలో కూనంనేని
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో క్రీడల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీఎం కప్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో పోస్టాఫీస్ సెంటర్ నుంచి రైల్వేస్టేషన్ వరకు సీఎం కప్ టార్చ్ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ.. 44 అంశాల్లో సీఎం కప్ క్రీడా పోటీలు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ క్రీడాకారులు ఒలింపిక్ స్థాయిలో పతకాలు సాధించాలనే లక్ష్యంతో ఈ టోర్నీ ఏర్పాటుచేశారని చెప్పారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ ఎం. పరంధామరెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు యుగంధర్‌రెడ్డి, మహీధర్, వెంకటేశ్వరరావు, రమేష్, కాశీహుస్సేన్, స్వాతిముత్యం, బాబ్జి, జాన్సన్, శ్రీధర్, మొగిలి, రఘు, కోచ్‌లు డానియల్, కళ్యాణ్, మల్లికార్జున్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఇల్లెందులో టార్చ్ ర్యాలీ
ఇల్లెందు: ఇల్లెందులో శుక్రవారం ఉదయం 8 గంటలకు సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రారంభమవుతుందని డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీలో యువత, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.


