పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేద మంత్రాలతో స్వామివారిని ఊరేగింపుగా యాగశాలలోకి తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతి పూజ అనంతరం హోమం చేసి, చివరకు పూర్ణహుతి జరిపించారు. హోమంలో పాల్గొన్న 17 మంది భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు.
వాహనాల ఫిట్‌నెస్‌పై
దృష్టి పెట్టాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను తరలించే వాహనాల ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రమాదాల నివారణకు పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించేలా అవగాహన కల్పించాలని అన్నారు. స్కూళ్లు, కాలేజీలకు విద్యార్థులను తరలించే వాహనాల విషయంలో నిబంధనలు పాటించేలా చూడాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్బీ, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్లు సీహెచ్ శ్రీనివాస్, ఎం.శ్రీనివాస్, ఎంవీఐలు వి.వెంకటరమణ, డి.మనోహర్, ఏవీఎంఐ ఫారూక్, రాజశేఖర్ రెడ్డి, అశోక్, రాకేష్, శ్వేత, మానస పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణలో
నిర్లక్ష్యంగా ఉండొద్దు
పాల్వంచరూరల్ : అటవీ ప్రాంతంలోని ప్లాంటేషన్ మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంగా ఉండొద్దని జిల్లా అటవీ శాఖాధికారి జి.కృష్ణాగౌడ్ అధికారులను ఆదేశించారు. కిన్నెరసాని అభయారణ్యంలోని చాతకొండ రేంజ్ గుండాలమడుగులోని ప్లాంటేషన్‌ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు చనిపోకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వైల్డ్‌లైఫ్ ఎఫ్‌డీఓ బి.బాబు తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం
పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం


