పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మవారికి అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
రేపు వేలం పాటలు
ఆలయ కొత్త కాంప్లెక్స్‌లోని 1,2,3 నంబర్ షాపులు, పాతకాంప్లెక్స్‌లోని 3,4 షాపులు, చీరలు పోగుచేసుకునే, పూలదండల విక్రయాల లైసెన్స్ హక్కులకు మంగళవారం సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి తెలిపారు.
32 పోస్టులకు
330 దరఖాస్తులు
సింగరేణిలో వైద్యుల పోస్టులకు
ముగిసిన దరఖాస్తు గడువు
రుద్రంపూర్: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 32 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులను రెగ్యులర్ బేసిస్‌లో నియమించేందుకు గత నెల 22న యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 3వ తేదీ వరకు దరఖాస్తు గడువు విధించింది. మొత్తం 330 మంది దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీరికి ఈ నెల 8,9 తేదీల్లో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పేర్కొన్నారు.
కొనసాగుతున్న
క్రీడా పోటీలు
అశ్వారావుపేట: అశ్వారావుపేట వ్యవసాయ క ళాశాలలో వ్యవసాయ విశ్వవిద్యాలయస్థాయి క్రీడాపోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం రెండోరోజు కబడ్డీ, ఖోఖో, క్రికెట్, బాస్కెట్‌బా ల్, రన్నింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్ పోటీలు ని ర్వహించారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ పోటీలను పర్యవేక్షిస్తున్నారు.
భద్రాద్రి కవుల ప్రతిభ
భద్రాచలంటౌన్: ఏపీలోని గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో జిల్లా కవులు ప్రతిభ చాటారు. కవి సమ్మేళనంలో తెలంగాణ సాహితి భద్రాచలం శాఖ బాధ్యులు తాతోలు దుర్గాచారి, కె.కనకదుర్గ, ఎం.పద్మావతి, ఉమాదేవి, కొత్తగూడేనికి చెందిన రాజేష్, ఎంవీవీ ప్రసాద్ పాల్గొని అద్భుతంగా కవితాలాపన చేశారు. అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ప్రపంచ స్థాయి వేదికపై కవితలు వినిపించి, సన్మానం అందుకున్న జిల్లా కవులను పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు అభినందించారు.
రాష్ట్ర బృందం పరిశీలన
ఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియాలో స్టేట్ లెవల్ ఎక్స్‌ఫర్ట్ అప్రైజర్ కమిటీ సభ్యులు దినేష్‌కుమార భరద్వాజ్, సరిత సజ్జ ఆదివారం పర్యటించారు. జేకే–5 ఓసీని సందర్శించి ప్లాంటేషన్‌ను పరిశీలించారు.ఓబీ ఏరియాలో పర్యావరణ పరిరక్షణపై ఆరా తీశారు. అధి కారులు సైదులు, కృష్ణయ్య, రామస్వామి, శంకర్ శ్రీనివాస్, జాకీర్ హుస్సేన్, గోవిందరావు, శ్రీనివాసరావు, రమణారెడ్డి పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పెద్దమ్మతల్లికి విశేష పూజలు


