యాసంగి సాగు 54.7 శాతం
● జిల్లాలో మొక్కజొన్న, వేరుశనగ అధికం ● నీటి వనరులు ఉన్నచోట పనులు వేగవంతం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో గత సీజన్ మాదిరిగా కాకుండా ఈసారి యాసంగి సాగు ఊపందుకుంది. జలవనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మరింత వేగవంతంగా వ్యవసాయ పనులు సాగుతున్నాయి. దీంతో ప్రధాన పంటల నిర్దేశిత విస్తీర్ణ లక్ష్యంలో ఇప్పటివరకు 54.7 శాతం సాగైంది. యాసంగిలో ప్రధాన వ్యవసాయ పంటల సాధారణ విస్తీర్ణం 1,56,667 ఎకరాలుగా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 84,713 ఎకరాల్లో రైతులు వివిధ పంటల సాగు చేపట్టారు. మొక్కజొన్న, వేరుశెనగ సాగు లక్ష్యం పూర్తి కానుండగా, వరి ఇంకా ఊపందుకోలేదు. జిల్లాలో పొగాకు 2,255 ఎకరాల్లో సాగు చేపట్టారు. కేవలం ఐదు మండలాల్లోనే ఈపంట సాగవుతోంది. అధికంగా అశ్వారావుపేట మండలంలో 1,662 ఎకరాలు, ములకలపల్లి మండలంలో 320 ఎకరాలు, దమ్మపేట మండలంలో 210 ఎకరాలు, అన్నపురెడ్డిపల్లి మండలంలో 60 ఎకరాలు, చండ్రుగొండ మండలంలో 3 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు.
పంట సాధారణ సాగు
విస్తీర్ణం విస్తీర్ణం
వరి 79,000 16,833
మొక్కజొన్న 65,000 51,453
వేరుశనగ 2,700 2,151
నువ్వులు 260 28
పొద్దుతిరుగుడు 105 88
మినుము 302 223
అలసంద 200 182
పెసర 650 150
మిర్చి 7,500 9,779
కూరగాయలు 950 1,299
మొత్తం 1,56,667 84,713


