హాకీ పోటీల్లో గౌరారం విద్యార్థినుల ప్రతిభ
దుమ్ముగూడెం: ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే పరిమితులు ఎన్ని ఉన్నా అద్భుతాలు సృష్టించవచ్చని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు నిరూపించారు. పాఠశాలలో అందజేస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని తమలోని క్రీడా ప్రతిభను బయటకు తీసి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో నిర్వహించిన అండర్–14 అంతర్ జిల్లా హాకీ టోర్నీలో పాల్గొన్న మండలంలోని గౌరారం బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థినులు 9వ తరగతికి చెందిన పోడియం సుగుణ, కల్లూరి రిషికవర్ధిని, కొమరం నవ్య, మీడియం సునీత, కంగాల సంధ్య, 8వ తరగతికి చెందిన మడకం మౌనిక, పొడియం అనూష, 6వ తరగతికి చెందిన సోడే అద్విత ప్రతిభ చూపి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకొచ్చారు. వీరిలో పోడియం సుగుణ జాతీయస్థాయికి ఎంపిక కాగా శనివారం పాఠశాలలో పాఠశాల హెచ్‌ఎం మడకం మోతీర్ ఆమెను ప్రత్యేకంగా అభినందించడంతో పాటు మిగతా క్రీడాకారులను అభినందించి భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను అభినందించిన వారిలో డిప్యూటీ వార్డెన్ పూనెం లక్ష్మీపతిరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు పూనెం రవీందర్, తోలెం శ్రీనివాసరావు, సోడే శ్రీనివాసరావు, శ్యామల సత్యవతి, మట్ట రామారావు, ఎం.సురేష్ బాబు, ఉమాదేవి, ఆదిలక్ష్మి, రాధిక, వెంకటేశ్వర్లు, దుర్గాబాయి, ఎ.హరిలాల్ రుక్మిణీ, లక్ష్మీదేవి తదితరులు ఉన్నారు.
జాతీయస్థాయి
పోటీలకు ఎంపికై న సుగుణ
హాకీ పోటీల్లో గౌరారం విద్యార్థినుల ప్రతిభ


