5.3 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: భద్రాచలం ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద శనివారం నిర్వహించిన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. ఖమ్మం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. పట్టణంలోని ఆర్‌టీఏ చెక్‌పోస్ట్ వద్ద ఎకై ్సజ్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా వస్తున్న టీఎస్ 05 యూఏ 8153 నంబర్ కారును ఆపి తనిఖీ చేయగా.. అందులో 5.3 కిలోల ఎండు గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం మల్కాజగిరి జిల్లా గిరికాన్‌పల్లికి చెందిన శిబ్ శంకర్ సర్దార్ మల్కాజగిరి నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పట్టుబడిన గంజాయితో పాటు ఒక కారు, ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని భద్రాచలం ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించిన్నట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, వెంకట్, వీరబాబు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.


