‘బార్’ ఎన్నికలకు నామినేషన్ దాఖలు
ఖమ్మంలీగల్: తెలంగాణ బార్ కౌన్సిల్‌కు పోటీ చేస్తున్న మందడపు శ్రీనివాసరావు శనివారం హైకోర్టు ప్రాంగణంలోని తెలంగాణ బార్ కౌన్సిల్ కార్యాలయంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) తరఫున తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి, నేషనల్ కౌన్సిల్ మెంబర్లు జలసూత్రం శివరామ్‌ప్రసాద్, ఏడునూతల శ్రీనివాసరావు, ఐలు మహిళా వింగ్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ సభ్యులు గాదె సునంద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు కె.పుల్లయ్య రావిలాల రామారావు, కిలారు పురుషోత్తంరావు, పోశం భాస్కరరావు, వుడతనేని శ్రీనివాసరావు, నవీన్ చైతన్య, చింతనిప్పు వెంకట్, రామబ్రహ్మం, శ్రీలక్ష్మి, డి.నారాయణ, పాపయ్య, మీసాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కేయూ జోనల్ క్రీడలు ప్రారంభం
ఖమ్మంస్పోర్ట్స్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఖమ్మం జోనల్ క్రికెట్ పోటీలు శనివారం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభమయ్యాయి. వీటిని డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, సత్తుపల్లి జెవీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.గోపి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నగరంలో క్రికెట్ స్టేడియం వచ్చే ఏడాది నాటికి పూర్తి అవుతుందని, జిల్లా క్రికెటర్లు జాతీయస్థాయిలో రాణించేలా కష్టపడాలని సూచించారు. క్రమశిక్షణతోనే క్రీడల్లో రాణించగలరని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రవికుమార్, ఖమ్మం జోన్ క్రీడల కార్యదర్శి బి.వెంకన్న, నెట్ క్రికెట్ కోచ్ ఎండీ మతిన్, జి.గోపీకృష్ణ, జె.ఉపేందర్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రెండు రోజుల పాటు జరిగే టోర్నీలో 11 జట్లు పాల్గొన్నాయి. తొలి రోజు యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, జేవీఆర్ సత్తుపల్లి, ప్రియదర్శిని డిగ్రీ కళాశాల కొత్తగూడెం, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల ఖమ్మం ముందజ వేశాయి. సెమీ ఫైనల్స్‌కు ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ఖమ్మం, జేవీఆర్ సత్తుపల్లి చేరాయి. అయితే, తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ఖమ్మం – ప్రియదర్శిని డిగ్రీ కళాశాల కొత్తగూడెంపై నెగ్గి ఫైనల్స్‌కు ప్రవేశించింది.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
అశ్వాపురం: మండలంలో అమ్మగారిపల్లిలో గోదావరి నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను తహసీల్దార్ మణిధర్ ఆదేశాల మేరకు శనివారం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న కుమ్మరిగూడేనికి చెందిన పాయం నాగేశ్వరరావు ట్రాక్టర్‌ను పట్టుకొని కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఘర్షణలో ఒకరికి గాయాలు
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణం చర్ల రోడ్డులోని ఓ వైన్ షాపు వద్ద శనివారం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి గాయాలయ్యాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై లిక్కర్ బాటిల్‌తో దాడి చేయడంతో గాయాలైనట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇరువర్గాల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీఐ నాగరాజు తెలిపారు.
‘బార్’ ఎన్నికలకు నామినేషన్ దాఖలు


