గ్రావెల్ ట్రాక్టర్లు సీజ్
భద్రాచలంటౌన్: అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్‌చేశారు. పట్టణ శివా రు ప్రాంతాల్లో కొందరు అక్రమంగా గ్రావెల్ తరలిస్తుండగా తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. అనమతులు లేకపోవడంతో మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి, జరిమానా విధించారు.
నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష
సూపర్‌బజార్(కొత్తగూడెం)/బూర్గంపాడు: పోక్సో కేసులో నిందితుడికి ఏడు సంవత్సరాల జైలుశిక్షతోపాటు 1,000 రూపాయల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (పోక్సో స్పెషల్ జడ్జి, అదనపు ఇన్‌చార్జి) ఎస్.సరిత సోమవారం తీర్పు చెప్పారు. వివరాలు ఇలా.. బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్‌కు చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన కల్తీ వెంకటేశ్వర్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2020 డిసెంబర్ 12న ఫిర్యాదు అందగా, పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. 10 మంది సాక్షులను విచారించగా, నిందితుడు కల్తీ వెంకటేశ్వర్లుపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడీ లక్ష్మి వాదనలు వినిపించగా, ఎస్సై డి.రాఘవయ్య, లైజన్ అధికారి ఎస్.వీరభద్రం, కోర్టు డ్యూటీ అధికారి మహమ్మద్ అక్రమ్ సహకరించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ..
దమ్మపేట: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు నాలుగు రోజుల జైలుశిక్షను విధిస్తూ దమ్మపేట కోర్టు జడ్జి భవాని సోమవారం తీర్పునిచ్చారు. అదే కేసులో మరో 8మంది వ్యక్తులకు నాలుగు రోజులపాటు కమ్యూనిటీ సర్వీస్‌ను శిక్షగా విధించారు.


