అభివృద్ధి పనుల పేరుతో ఇసుక రవాణా
బూర్గంపాడు: మండల పరిధిలోని పాత గొమ్మూరు వద్ద గోదావరి నుంచి ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సోమవారం నాగినేనిప్రోలు గ్రామస్తులు అడ్డుకున్నారు. సారపాకలో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు(సీసీ రోడ్డు) పనులకు ఇసుక సరఫరా చేస్తున్నామని ట్రాక్టర్ల యజమానులు పేర్కొనగా, అనుమతి పత్రాలేవంటూ గ్రామస్తులు నిలదీశారు. పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా, వారు అక్కడకు చేరుకుని ఇసుక రవాణాకు కూపన్లు ఇవ్వలేదని తెలిపారు. సీసీరోడ్ల నిర్మాణాలకు కాంట్రా క్టర్లు రాయల్టీ చెల్లించి ఇసుక కొనుగోలు చేయాలని, అలా కాకుండా అభివృద్ధి పనుల పేరుతో ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిలో ఇసుకను అధికారికంగా తీయాలంటే మైనింగ్ శాఖ అనుమతులుండాలని పేర్కొన్నారు. రెవెన్యూ అధి కారులు చెప్పారని ఇసుకను తరలించటం అక్రమమేనని స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగా రు. దీంతో అధికారులు ఏడు ఇసుక ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించి ఇసుకను అక్కడ అన్‌లోడ్ చేయించారు. కాగా కూపన్లు ఇచ్చాకే ఇసుక రవాణా చేయాలని అధికారులు సూచించారు.
అనుమతుల్లేకపోవడంతో
అడ్డుకున్న గ్రామస్తులు


