బైక్‌ ఢీకొని మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ఢీకొని మహిళ మృతి

Nov 25 2025 9:22 AM | Updated on Nov 25 2025 9:22 AM

బైక్‌ ఢీకొని మహిళ మృతి

బైక్‌ ఢీకొని మహిళ మృతి

దుమ్ముగూడెం: వేర్వేరు చోట్ల సోమవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బైరాగులపాడు గ్రామానికి చెందిన కొప్పుల రాజేశ్వరి (40 ) ఆదివారం సాయంత్రం రోడ్డు దాటుతోంది. అదేసమయంలో బైక్‌పై వస్తున్న చిన్న నల్లబెల్లి గ్రామానికి చెందిన పూసం రాజేష్‌ ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలుకాగా ఆమెను భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది.

బైక్‌ కల్వర్టులో పడి..

మండలంలోని బుర్రవేములా గ్రామ శివారు నందులచెలక గ్రామానికి చెందిన సోయం రాజాబాబు(26) పని నిమిత్తం లక్ష్మీనగరం ఎస్‌బీఐ బ్యాంక్‌కు వస్తున్నా డు. ఈ క్రమంలో వస్తుండగా బుర్రవేములా శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కల్వర్టులో పడింది. దీంతో తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. రాజాబాబు భద్రాచలం ఆర్టీసీ డిపోలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో మెకా నిక్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ప్రమాదాలపై సీఐ వెంకటప్పయ్య, ఎస్సై గణేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో

ముగ్గురికి గాయాలు

అశ్వారావుపేటరూరల్‌: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలైన ఘటన సోమవారం అశ్వారావుపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని పేరాయిగూడెం సమీపంలో ద్విచక్రవాహనం, స్కూటీ ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నా యి. ఈ ఘటనలో పట్టణంలోని ఫైర్‌ కాలనీకి చెందిన మేకా అమర్‌నాథ్‌కు తీవ్ర గాయాలు కాగా, ఏపీలోని ఏలూరు జిల్లా కుక్కునూరుకు చెందిన మరో ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

నలుగురిపై కేసు నమోదు

పాల్వంచరూరల్‌: దాడి ఘటనలో నలుగురిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని మొండికట్ట గ్రామానికి చెందిన పల్ల పు సరోజ తన భర్త హరిబాబు వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్‌ఐ స్టేషన్‌కు పిలిపించి భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. స్టేషన్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా హరి బాబు, అతని సోదరి పేవళ్ల ఏలిశమ్మలపై భార్య తరఫు బంధువులు కిన్నెరసాని సెంటర్‌లో అడ్డగించి దాడి చేశారని హరిబాబు ఫిర్యాదు చేశాడు. దీంతో దాడిచేసిన గండికోట అచ్చయ్య, బాలకృష్ణ, మల్లయ్య, దన్నళ్ల వెంకన్నలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

ఆటో డ్రైవర్‌పై..

ఇల్లెందురూరల్‌: ఇల్లెందు–గుండాల ప్రధాన రహదారిలో కొమరారం ఎస్సై నాగుల్‌మీరా సోమవారం వాహన తనిఖీ నిర్వహించారు. అదే సమయంలో ఇల్లెందు నుంచి గుండాల వైపుగా 20 మంది ప్రయాణికులతో వేగంగా వస్తున్న ఆటోను నిలిపి డ్రైవర్‌ ఆంగోత్‌ చంద్రుపై కేసు నమోదు చేశారు. డ్రైవర్‌తోపాటు, ప్రయాణికులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వాహనంలో పరిమితికి మించి ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని సూచించారు.

పేకాట స్థావరంపై

దాడులు

జూలూరుపాడు: జూలూరుపాడు గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో పేకాటస్థావరంపై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు. అన్నారుపాడు గ్రామానికి చెందిన ముగ్గురు పేకట రాయుళ్లను అరెస్ట్‌ చేశారు. రూ.2,000నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ దయానంద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement