జనసేవాదళ్ శిక్షణ ప్రారంభం
సూపర్‌బజార్(కొత్తగూడెం): ీసపీఐ అనుబంధ జనసేవాదళ్ వలంటీర్ల శిక్షణ రామవరం సాధన క్రీడా మైదానంలో సోమవారం ప్రారంభమైంది. కొత్తగూడెం టౌన్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల వలంటీర్లు శిక్షణకు హాజరవుతున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. ప్రజారక్షణ దళంగా యువతను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆపద, విపత్తుల సమయాల్లో ప్రజలకు సహాయం చేసేందుకు యువతకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సీపీఐ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా భారీ బహిరంగ సభ, కవాతు నిర్వహిస్తామని అన్నారు. ఇందుకోసం మూడు వేల మందిని జనసేవాదళ్ దళంగా తయారుచేస్తున్నామని తెలిపారు. ఎల్డీఆర్‌ఎఫ్, మిలిటరీ, ఆర్మీ దళాల శైలిలోనే కఠినమైన శిక్షణా విధానాన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. శిక్షకులు మురళి, భూక్యా శ్రీనివాస్ శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, కందుల భాస్కర్, ఏకే ఫహీమ్, భూక్య శ్రీనివాస్, మునిగడప వెంకటేశ్వర్లు, కె.రత్నకుమారి, మహేష్, మునిగడప పద్మ, మంద నిర్మల తదితరులు పాల్గొన్నారు.


