ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేయాలి
దుమ్ముగూడెం: ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేసేవరకు పోరాటం చేస్తామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండలంలోని పర్ణశాల క్రాస్ రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై ఇసుక లారీల ను అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక దోపిడీతో కోట్లాది రూపాయలు స్వాహాచేస్తూ ఏజెన్సీ లోని ప్రధాన రహదారి ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. లారీల రాకపోకలతో దుమ్ము, ధూళి లేచి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని అనానరు. అభివృద్ధి చేస్తానని చెప్పి పార్టీ మారి న ఎమ్మెల్యే వ్యక్తిగత అభివృద్ధే చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మానె రామకృష్ణ, సాగి శ్రీని వాసరాజు, కణితి రాముడు, జానీ పాషా, రేసు లక్ష్మి, జోగా వెంకటరమణ, కొత్తూరు సీతా రామారావు, బొల్లి వెంకట్రావు, భూక్యాచందు, సోడి జ్యోతి పాల్గొన్నారు.
జమేదార్ల శిక్షణ ప్రారంభం
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని సింగరేణి ఎస్‌అండ్ పీసీ ట్రైనింగ్ సెంటర్‌లో 14వ బ్యాచ్ జమేదార్ల శిక్షణా తరగతులు సోమవారం ప్రా రంభమయ్యాయి. సెక్యూరిటీ విభాగం మేనేజర్ జీఎం జాకీర్ హుస్సేన్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రా రంభించి మాట్లాడారు. జమేదార్లు ఫ్రంట్‌లైన్ సూపర్ వైజర్‌గా కీలకపాత్ర పోషిస్తారని అన్నా రు. మెరుగైన వృత్తి నైపుణ్యం, అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, సింగరేణి ఆస్తులను పరి రక్షించాలని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ట్రైనింగ్ ఇన్‌స్పెపెక్టర్ డి.నారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
సీఐటీయూ నూతన
కార్యవర్గం ఎన్నిక
మణుగూరు టౌన్: సీఐటీయూ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. మణుగూరులోని కిన్నెర కల్యాణ మండపంలో 4వ జిల్లా మహాసభలు రెండు రోజులపాటు నిర్వహించారు. సోమవా రం 45 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా కొలగాని బ్రహ్మాచారి, కార్యదర్శిగా ఏజే రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితోపాటు ఉపాధ్యక్షులుగా జీలకర్ర పద్మ, పిట్టల అర్జున్, గద్దల శ్రీనివాస్‌రావు, నబీ, దొడ్డ రవికుమార్, వెంకటరాజు, ఈసావెంకటమ్మ,సహాయ కార్యదర్శు లుగా సత్య, ధనలక్ష్మితోపాటు మరికొందరిని కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఇటీవల తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం నిర్వహిస్తామని తెలిపారు.
క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి
పాల్వంచరూరల్: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారుల కోసం తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్న కోచింగ్ క్యాంప్‌ను సద్వి నియోగం చేసుకోవాలని ఏటీడీఓ చంద్రమోహన్ అన్నారు. మండల పరిధి కిన్నెరసానిలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో సోమవారం శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వచ్చే నెల 3,4,5వతేదీల్లో ఏటూరునాగారంలోజరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వివిధ క్రీడలకు సంబంధించి 124 మంది ఎంపికయ్యారని తెలిపారు. వారికి డిసెంబర్ 2వ తేదీ వరకు శిక్షణ ఇస్తామని తెలి పారు. క్రీడల అధికారి బొల్లి గోపాల్‌రావు, ఏ ఎస్‌ఓ కొమరం వెంకటనారాయణ, సోయం నాగేశ్వరరావు, పీడీ బాలసుబ్రమణ్యం, హెచ్‌ఎం చందు, శిక్షకులు వెంకన్న, రాంబాబు, గోపాల్‌రావు, మోతీలాల్, ఎస్.వీరభద్రం, బాబురావు, డి.అంజివాసు, మండల్ సతీష్ పాల్గొన్నారు.
ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేయాలి
ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేయాలి
ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేయాలి


