
అందుబాటులోకి అత్యాధునిక యంత్రం
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధి మెయిన్ వర్క్‌షాపులో అత్యాధునిక సీఎన్‌సీ పాలిగన్ మిల్లింగ్ మిషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రాన్ని గురువారం సింగరేణి డైరెక్టర్(ఈ అండ్ ఎం) సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంత్రం ద్వారా అత్యంత వేగం, కచ్చితత్వంతో కూడిన సేవలు అందుతాయని తెలిపారు. సమస్యల గుర్తింపు, పరిష్కారంతో పాటు బొగ్గు ఉత్పత్తి పెంచడంతో ఈ యంత్రం దోహదపడుతుందని చెప్పారు. అనంతరం ఈనెల 31న ఉద్యోగవిరమణ చేయనున్న డైరెక్టర్ సత్యనారాయణను ఉద్యోగులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీఎం(ఈ అండ్ ఎం) ఎన్.దామోదర్‌రావు, ఏజీఎం రాజీవ్‌కుమార్, గుర్తింపు సంఘం నాయకులు ఎస్.వీ.రమణమూర్తి, పీతాంబరరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.