
మూడో అదనపు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌గా ‘వనం’
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం జిల్లా కోర్టులో మూడో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా వనం వినయ్‌కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు హైకోర్టు నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీంతో గురువారం ఆయన కొత్తగూడెం రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ బి.రవికుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
భద్రాచలం అడిషనల్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్‌గా దుర్గాభవాని
భద్రాచలంఅర్బన్: భద్రాచలం అడిషనల్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్‌గా దుర్గాభవాని గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ కేంద్రియ విద్యాలయంలో పాఠశాల విద్య, బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బీకాం పూర్తిచేసిన ఆమె తల్లిదండ్రులిద్దరు న్యాయవాదులే కావడంతో హైదరాబాద్‌లోని పెండేకంటి లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చదివారు. ఆతర్వాత 2022 న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఆమె జడ్జిగా ఎంపికవడంతో మొదటి పోస్టింగ్ భద్రాచలంలో వచ్చింది. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన దుర్గాభవానిని బార్ అసోసియేషన్ బాధ్యులు, న్యాయవాదులు సన్మానించారు.
రెండు నెలలుగా
వేతనాలు బంద్..
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన నేపథ్యాన వేతనాల ఫైల్ రాష్ట్ర ట్రెజరీ కార్యాలయంలో నిలిచిపోయిందని, అక్కడి నుంచి జిల్లాకు వస్తే బిల్లు చేసే అవకాశముందని సమాచారం. కాగా, వేతనాలు ఇప్పించాలని కోరతూ ఎమ్మెల్యేతో పాటు ప్రజావాణిలో సైతం విన్నవించినా ఫలితం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. మొత్తంగా కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచలో శానిటేషన్ విభాగం, మేనేజర్ కేడర్, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు, అకౌంటెంట్లు, టౌన్‌ప్లానింగ్, వాటర్ సప్‌లై విభాగాల్లో 171 మందికి వేతనాలు నిలిచిపోయాయి. ఇకనైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి వేతనాలు అందేలా చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు.
కొమరారం పోస్ట్‌మాస్టర్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డు
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామపంచాయతీ పోస్ట్‌మాస్టర్ అనుగోజు సుభాష్‌కు పోస్టల్ డిపార్ట్‌మెంట్ రీజియన్ ఎక్స్‌లెన్స్ అవార్డు వరించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ పీ.వీ.ఎస్. రెడ్డి, పోస్ట్‌మాస్టర్ జనరల్ సుమిత అయోధ్య, ఖమ్మం, వరంగల్ డివిజన్ సూపరింటెండెంట్లు వీరభద్రస్వామి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలో
పరిశీలించిన డీఈఓ
కొత్తగూడెంఅర్బన్: భవిత కేంద్రం ఏర్పాటుకు స్థల సేకరణ కోసం జిల్లా విద్యాశాఖాధికారి నాగలక్ష్మి గురువారం కొత్తగూడెంలోని బాబు క్యాంపు ప్రైమరీ పాఠశాలను సందర్శించారు. భవిత కేంద్రం భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం ఎంఈఓ బి.బాలాజీ, పాఠశాల ఉపాధ్యాయులతో చర్చించారు. పాఠశాలలోని వ్యాయామశాల స్థలం, బాబు క్యాంప్‌లో ఖాళీగా ఉన్న క్వార్టర్లు, పాత ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయ స్థలాలను సైతం ఆమె పరిశీలించారు. ఈక్రమంలోనే బాబు క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు, విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. ఎంపీడీఓ సుభాషిణి, హెచ్‌ఎం బి.నీరజ, గ్రామ కార్యదర్శి వి.సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మూడో అదనపు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌గా ‘వనం’

మూడో అదనపు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌గా ‘వనం’

మూడో అదనపు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌గా ‘వనం’