
పాఠశాలలోకి పాము
దమ్మపేట: మండలంలోని నెమలిపేట గ్రామ కాలువకు వరద ఉధృతి పెరగడంతో పక్కనే ఉన్న ఇళ్లు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరు చేరుకుంది. కాలువ ప్రవాహంలో వచ్చిన ఓ పాము.. వరద నీటిలో పాఠశాల ప్రాంగణంలోకి రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
అశ్వారావుపేట రూరల్: అశ్వారావుపేటలో డంపింగ్ యార్డు వద్ద బుధవారం సాయంత్రం పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.2,910 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై టి.యయాతి రాజు తెలిపారు.
షోరూమ్‌లో బైక్ దొంగతనం..
కూనవరం రోడ్డులో పట్టుకున్న పోలీసులు
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణం చర్ల రోడ్డులో గల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ షోరూమ్‌లోని ఓ బైక్‌ను ఈ నెల 26 అర్ధరాత్రి ఓ వ్యక్తి దొంగిలించాడు. ఈవిషయమై 27న ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌లో షోరూమ్ నిర్వాహకులు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టిన పోలీసులు బుధవారం సాయంత్రం ఆ బైక్ దొంగను పట్టణంలోని కూనవరం రోడ్డులో పట్టుకున్నారు. స్టేషన్‌కు తరలించి విచారించగా.. దుమ్ముగూడెంకు చెందిన కణితి వెంకటేశ్వర్లుగా తేలిందని పోలీసులు తెలిపి అతడిపై కేసు నమోదు చేశారు.
చెట్లు నరికిన వ్యక్తికి జరిమానా..
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామపంచాయతీ పరిధిలో రహదారి పక్కన నాటిన అవెన్యూ ప్లాంటేషన్‌లోని మొక్కలను పోలారం గ్రామానికి చెందిన రైతు ఆంగోత్ రాంబాబు బుధవారం నరికాడు. ఈ చెట్ల ద్వారా మొక్కజొన్న చేనులో కోతుల బెడద ఎక్కువైనందున నరికినట్లు రైతు చెబుతున్నాడు. గురువారం పరిశీలించిన పంచాయతీ కార్యదర్శి కిరణ్ అనుమతులు లేకుండా నరికిన ఐదు చెట్లకు గాను రూ.5వేలు జరిమానా విధించి రశీదు అందించారు. మొక్కలు నరికిన స్థానంలో పది మొక్కలు నాటాలని షరతు విధించినట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు.
ప్రసూతి మరణాలు అరికట్టేలా అవగాహన
కొత్తగూడెంఅర్బన్: ప్రసూతి మరణాలు లేకుండా చూడాల్సిన అవసరముందని జిల్లా వైద్యా, ఆరోగ్యశాఖాధికారి జయలక్ష్మి తెలిపారు. గురువారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రసూతి మరణాలపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రసూతి మరణాలను నివారించడానికి కౌన్సెలింగ్, ఆరోగ్య విద్య కీలకమని, ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడం, మెరుగుపర్చడం, రోగులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులకు నిరంతరం అవగాహన కల్పించడం వలన ప్రసూతి ఆరోగ్య ఫలితాలను మెరుగుపర్చవచ్చారు. ఈ సందర్భంగా చంద్రుగొండ, ఎంపీ బంజారా, కొమ్రారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వైద్యాధికారులు హాజరై ప్రతి కేసుపై సమగ్ర నివేదికలను సమర్పించారు. ఈ సమావేశంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వి.మధువరన్, డాక్టర్ పి.స్పందన, డాక్టర్ భూపాల్‌రెడ్డి, డిప్యూటీ డెమో ఎండీ ఫైజ్మోహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.