
గోల్డ్‌షాపులో చోరీకి యత్నం
ములకలపల్లి: మూసి ఉన్న గోల్డ్‌షాపులో చోరీకి యత్నించిన ఓ ఆగంతకుడికి తాళాలు పూర్తిగా తెరుచుకోకపోవడంతో వెనుదిరిగాడు. వివరాల్లోకి వెళితే.. స్థానిక ఇజ్జాడ శ్రీరామ్ ములకలపల్లి మెయిన్ సెంటర్‌లో వీర వర మహాలక్ష్మి పేరిట ఉన్న బంగారపు కొట్టును రోజూలాగానే బుధవారం రాత్రి షట్టర్ తాళాలు వేసి ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం ఆ షాపు తాళాలు పగులకొట్టి ఉన్నట్లు గమనించిన స్థానికులు షాపు యజమానికి ఫోన్ చేయగా.. ఆయన వచ్చి చూసి పోలీసులకు సమాచారం అందించారు. సుమారు పాతికేళ్ల యువకుడు మాస్క్ ధరించి చోరీకి యత్నించినట్లు సీసీ ఫుటేజీలో రికార్డు కాగా, మెయిన్ లాక్ తెరచుకోకపోవడంతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఆటోలో వచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయమై ఎటువంటి ఫిర్యాదు అందలేదని.. అయితే సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నాయని ఎస్సై మధుప్రసాద్ తెలిపారు.
మెయిన్ తాళం తెరుచుకోకపోవడంతో వెనుదిరిన ఆగంతకుడు