
హెచ్‌సీఏ టోర్నీలో భద్రాద్రి క్రికెటర్ ప్రతిభ
భద్రాచలంటౌన్: భద్రాచలానికి చెందిన క్రికెటర్ నక్కా రిత్విక్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యాన ఘట్‌కేసర్‌లో నిర్వహించిన వన్డే లీగ్ టోర్నీలో ప్రతిభ చాటాడు. చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆయన 134 బంతుల్లో 16ఫోర్లు, ఒక సిక్స్‌తో 116 పరుగు లు సాధించాడు. భద్రాచలంలోని క్రాంతి విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న రిత్విక్‌ను పాఠశాల చైర్మన్ సోమరౌతు శ్రీనివాస్ అభినందించారు.
యూరియా
అందించడంలో విఫలం
జూలూరుపాడు: రైతులకు సరిపడా యూరి యా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్రకుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన జూలూరుపాడులో మాట్లాడారు. యూరియా కొరత నివారించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఽఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సహకార సంఘాల గోదాముల వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులుదీరుతున్నారన్నారు. యూరి యా బస్తాల కోసం రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాస్తే ఒకటి, రెండు కట్టలు ఇస్తున్నారని పేర్కొన్నారు.
గంజాయి పట్టివేత?
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని బ్రిడ్జి పాయింట్ చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం రెండుకార్లలో ముగ్గురువ్యక్తులు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా కొత్తగూడెం సీసీఎస్ పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకకార్లో గంజాయి తరలిస్తుండగా మరో కారు వీరికి ఎస్కార్ట్‌గా వస్తున్నట్లు తెలిసింది. పట్టుబడిన గంజాయి, కార్లను కొత్తగూడెం తరలించిన సీసీఎస్ పోలీసులు.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించాల్సి ఉంది.
33 గ్యాస్ సిలిండర్లు చోరీ
బూర్గంపాడు: సారపాకలోని శ్రీసాయి గ్యాస్ ఏజెన్సీ గోదాంలోని 33 గ్యాస్ సిలిండర్లు చోరీకి గురయ్యాయి. గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ గణేశ్ ఫి ర్యాదు మేరకు ఎస్‌ఐ మేడ ప్రసాద్ కేసు నమోదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు గ్యాస్ గోదాంలో చొరబడి 33 నిండు గ్యాస్ సిలిండర్లను అపహరించారు. సోమవారం గ్యాస్ గోదాం తెరిచిన తరువాత గ్యాస్ సిలిండర్లు చోరీకి గురైనట్లు గుర్తించిన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ప్రసాద్ మంగళవారం కేసు నమోదు చేశారు.