
తెల్లవాగు చెరువు తూము లీకేజీ
ములకలపల్లి: మండలంలోని పూసుగూడెం శివారు తెల్లవాగు చెరువు ఎడమ తూము ఎడమ షట్టర్ లీకేజీ అవుతోంది. దీంతో 450 ఎకరాల ఆయకట్టు కలిగిన చెరువులోని నీళ్లు వృథాగా పోతున్నాయి. చెరువు నిండా నీరు ఉన్న నేపథ్యాన లీకేజీతో రెండు రోజులుగా కాల్వ గుండా దిగువకు ప్రవహిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇరిగేషన్ అధికారులు మంగళవారం మరమ్మతులు చేపట్టారు. ఈ విషయమై నీటి పారుదల శాఖ ఏఈ గఫూర్‌పాషాను వివరణ కోరగా చెరువు నిండా నీళ్లు ఉండడంతో సమస్యను గుర్తించడం కష్టంగా మారినా తాత్కాలిక మరమ్మతు చేసినట్లు తెలిపారు. కాగా, తూము లీకేజీ మరమ్మతులు సత్వరమే చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం పనులను పరిశీలించి మాట్లాడారు. పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, నాయకులు మాలోతు రావూజా, పొడియం వెంకటేశ్వర్లు, తేజావత్ జగ్గు, పులి వెంకటేశ్వర్లు, దుబ్బా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మరమ్మతులు చేపట్టిన ఇరిగేషన్ అధికారులు