
మత ఫాసిజాన్ని ప్రతిఘటిస్తేనే వ్యవస్థల పరిరక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: దేశంలో పెరుగుతున్న మత ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడి లౌకిక వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలు, ప్రజాస్వామ్యవాదులపై ఉందని రిటైర్డ్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరి గిన నాస్తిక సమాజ, అధ్యయన తరగతుల్లో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టులు దేశ పరిస్థితినే కాక ప్రపంచ పరిస్థితులను అధ్యయనం చేస్తూ పోరాట పంథా రూపొందించుకోవాలని సూచించారు. భావ మే ప్రధానంగా భావించిన వారు భావవాదులుగా, పదార్థమే ప్రధానంగా భావించిన వారు భౌతిక వాదులుగా విభజించబడ్డారని చెప్పారు. అయితే, భౌతికవాదమే అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపించనుండగా, భావవాదం సమస్యల్ని ఇంకా పెంచుతుందని తెలిపారు. దీన్ని గుర్తించిన పాలకవర్గం ప్రజలను మత్తులో ఉంచడానికి మతం, దేవుళ్లను వాడుకుంటోందని వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి ఎవరికివారు తమను తాము ప్రశ్నించుకుంటే విజ్ఞానం వెల్లివిరుస్తుందని విజయ్‌కుమార్ తెలిపారు. అనంతరం ‘శాసీ్త్రయ దృక్పథం’ అంశంపై సీహెచ్.రమేష్, ‘వాస్తవాల ఆధారంగా జీవించడం ఎలా?’ అన్న అంశంపై బీ.వీ.రాఘవులు మాట్లాడారు. సామాజిక సంబంధమైన విషయాల్లో సత్యాలను బోధించే ఏకై క శాస్త్రం మార్క్సిజం అని పేర్కొన్నారు. ఈ తరగతులకు ఆవుల అశోక్, ప్రీతం అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా కన్నెబోయిన అంజయ్య, కోటేశ్వరరావు, చార్వాక, సుధాకర్, క్రాంతి, స్టాలిన్, ఝాన్సీ, శోభ తదితరులు పాల్గొన్నారు.
నాస్తిక సమాజ అధ్యయన తరగతుల్లో వక్తలు