
ఉప్పొంగిన వాగులు..
● రహదారులపైకి వరద ప్రవాహం ● పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ఇల్లెందు/ఇల్లెందురూరల్/గుండాల/జూలూరుపాడు: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు కుండపోతగా వర్షం కురిసింది. దీంతో పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. కొన్ని చోట్ల వరద నీరు రహదారులపైకి పోటెత్తింది. ఈ క్రమంలో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లెందు పట్ట ణానికి తాగునీరు అందించే ఇల్లెందులపాడు చెరువు అలు గుపోసి ప్రవహిస్తుండగా సత్యనారాయణపురం గ్రా మానికి రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. బుగ్గవాగు లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. పట్టణంలోని బర్లపెంట ఏరియాలోని రెండులో లెవల్ కాజ్‌వేలు పొంగి కల్వర్టు మీదుగా నీరు ప్రవహించగా నంబర్ – 2 బస్తీ, ఎల్‌బీఎస్ నగర్‌లకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్ష సూ చనల నేపథ్యంలో అధికారులంతా అలర్ట్‌గా ఉండాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. ఇల్లెందు మండలంలోని మస్సివాగు, బుగ్గవాగు ఉధృతంగా ప్రవహించడంతో పంటలు నీట మునిగాయి. ఇల్లెందు –మహబూబాబాద్ ప్రధాన రహదారిపై జెండాల వాగు వద్ద వరదనీరు రోడ్డు మీదుగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోచారంతండా, రాఘబోయినగూడెం, కొమ్ముగూడెం తదితర గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని కిన్నెరసాని, మల్ల న్న వాగు, ఏడుమెళికల వాగు, జల్లేరు, దున్నపోతుల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో నాగారం, దొంగతోగు, పాలగూడెం, కొడవటంచ, అడవిరామారం, సీతానగరం, రాయిగూడెం గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. జూ లూరుపాడుమండలంలో ప్రధానమైన పెద్దవాగు, తుమ్మలవాగు, ఎదళ్లవాగులు ఉప్పొంగడంతో 21 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భేతాళపాడు – పడమటనర్సాపురం గ్రామాల మధ్య గల పెద్దవాగు, తుమ్మలవాగు ఉధృతితో బ్రిడ్జిలపై నుంచి వరదనీరు పొంగి ప్రవహించింది. గుండ్లరేవు – అన్నారుపాడు అనంతారం – కాకర్ల, కాకర్ల – దుబ్బతండా, మాచినేనిపేట – వాగొడ్డుతండా మధ్య గల వాగులు పోటెత్తాయి. దీంతో అధికారులు వాగుల వద్ద ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి ప్రజలు దాటకుండా చర్యలు చేపట్టారు.

ఉప్పొంగిన వాగులు..

ఉప్పొంగిన వాగులు..