బూర్గంపాడు: మండల పరిధిలోని రాంపురం కేసీ ఆర్ కాలనీకి చెందిన సీహెచ్ స్వప్నకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు శనివారం ఉద యం 7 గంటలకు మోరంపల్లి బంజర పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. అయితే నొప్పులు ఎక్కువ కావడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశా రు. దీంతో ఆమెను 108 వాహనంలో భద్రాచలం తరలిస్తుండగా మధ్యలోనే నొప్పులు తీవ్రమయ్యాయి. 108 పైలట్ విజయభాస్కర్ వాహనాన్ని రోడ్డు పక్కకు నిలపగా ఈఎంటీ సుభద్ర స్వప్నకు పురుడుపోసింది. స్వప్న మూడో కాన్పులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ అయిన తక్షణమే తల్లీ బిడ్డను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా సుభ్రద, విజయభాస్కర్‌ను ఏరియా ఆస్పత్రి వైద్యులు అభినందించారు.
తల్లీ, బిడ్డ క్షేమం
108 వాహనంలో ప్రసవం