
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రరెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం నుంచి ఖమ్మంలో జిల్లాలో మొదలయ్యే మంత్రి పర్యటన కూసుమంచి, నేలకొండపల్లి మండలాలతో పాటు ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మంలో కొనసాగుతుంది. ఆతర్వాత సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, లక్ష్మిదేవిపల్లి మండలు, కొత్తగూడెం కార్పొరేషన్లలో జరిగే పలు ప్రైవేట్ కార్యక్రమాలకు మంత్రి హాజరవుతారు.
జిల్లా జట్టుకు
20 మంది ఎంపిక
పాల్వంచరూరల్: ఈనెల 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి అండర్–15 వాలీ బాల్ పోటీలకు జిల్లా నుంచి హాజరయ్యేందు కు 20 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ వాసిరెడ్డి నరేష్ తెలిపారు. మండల పరిధిలోని కిన్నెరసాని గిరిజన క్రీడా పాఠశాలలో శనివారం క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారు పుణెలో జరిగే జాతీయ పోటీలకు, అక్కడ ప్రతిభ చాటిన వారు చైనాలో జరిగే అంతర్జాతీయస్థాయి పోటీల్లో భారత్ జట్టు తరఫున పాల్గొంటారని వివరించారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారిలో బాలికల విభాగంలో నందమ్మ, వర్షిత, మస్రే క, ప్రసన్న, శ్రీలక్ష్మి, లాస్యభారతి, మేఘహర్ష, నందు, స్టాండ్‌బైగా వైశాలి, జనన్యశ్రీ ఉన్నారని, బాలుర విభాగంలో బుర్ర లోకేష్, విష్ణువర్దన్, రిషివర్మ, రాజు, వెంకన్నబాబు, వినయ్ కుమార్, లోకేష్, సందీప్, స్టాండ్‌బైగా సంతో ష్, హర్షవర్దన్‌ను ఎంపిక చేశామని వివరించా రు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వేణుగోపాల్, వెంకటనారాయణ, కవిత, కృష్ణ, సుబ్రమణ్యం, శ్రీనివాసరావు, సుజాత, సీత పాల్గొన్నారు.
ఆస్పత్రికి ముందస్తుగా గర్భిణి తరలింపు
అటవీ ప్రాంతంలో రహదారి సౌకర్యం లేనందునే..
చర్ల: మండలంలోని ఆదివాసీ గ్రామమైన వీరాపురం గ్రామానికి చెందిన ఓ గర్భిణిని వైద్యాదికారులు శనివారం ముందస్తుగా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సరైన రహదారి సౌకర్యం లేని గ్రామాలకు చెందిన గర్భిణులను.. వర్షాల నేపథ్యంలో ముందుగానే గుర్తించి డెలివరీ కోసం తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సత్యనారాయణపురం పీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బంది వీరాపురం వెళ్లి గర్భిణి లక్కీని 108 అంబులెన్స్‌లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ద్విచక్రవాహనాల చోరీ కేసులో అరెస్ట్
కొత్తగూడెంఅర్బన్: ద్విచక్ర వాహనాలను చోరీ చేసి విక్రయించేందుకు వెళ్తున్న ఇద్దరు పోలీసులకు చిక్కారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలాఉన్నాయి.. లక్ష్మీదేవిపల్లి రైతు వేదిక వద్ద రోడ్డుపై ఎస్‌ఐ రమణారెడ్డి సిబ్బందితో కలిసి శనివారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ద్విచ క్రవాహనాలపై బొమ్మనపల్లి వైపు నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న ఇద్దరు పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకుని విచారణ చేపట్టారు. దీంతో కొత్తగూడెంలోని న్యూ గొల్లగూడేనికి చెందిన సైకిల్ మెకానిక్ భీమవరపు యువరాజ్, ఏపీ రాష్ట్రంలోని హేమచంద్రాపురానికి చెందిన కంచర్ల అరవింద్‌రెడ్డి ఇద్దరూ కలిసి సూర్యాపేట జిల్లా కోదాడలో పల్సర్ మోటార్ సైకిల్, లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ రామారంలో టీవీఎస్ ఎక్సెల్ వాహనాలను చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ట్రాక్టర్ ట్రక్కు చోరీ
చింతకాని: మండలంలోని గోవిందాపురం(ఎల్) గ్రామానికి చెందిన రైతు ధర్మపురి పుల్లారావు ట్రాక్టర్ ట్రక్కు చోరీకి గురైంది. రైతు ఏడాది క్రితం ట్రాక్టర్ ఇంజన్, ట్రక్కు కొనుగోలు చేయగా, ప్రొద్దుటూరులో స్నేహితుడైన పాసంగులపాటి విష్ణువర్ధన్ అవసరాలకు శుక్రవారం పంపించాడు. ఆయన ఇంటి వద్ద శుక్రవారం రాత్రి ట్రక్కు చోరీ కావడంతో శనివారం పుల్లారావుకు సమాచారం ఇచ్చాడు. దీంతో రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన