
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి
మణుగూరుటౌన్: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను అంతమొందించేందుకు చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని, మావోయిస్టులను శాంతి చర్చలకు పిలవాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు పార్టీల నాయకులు మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మావోలతో చర్చలు జరిపేది లేదని కగార్ ఆపరేషన్‌ను వెనక్కు తీసుకోబోమని మాట్లాడటం వికృత చర్య అని, నియోజకవర్గంలో తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనుల హత్యలు చేస్తున్నా మాట్లాడకపోవడం విచారకరమన్నారు. ఈ నెల 12వ తేదీన అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు జరిగే శాంతి ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అఖిలపక్ష నాయకులు అయోధ్య, నెల్లూరు నాగేశ్వరరావు, ఏనుగు చంద్రం, రూపురెడ్డి మధుసూదన్‌రెడ్డి, సువర్ణపాక నాగేశ్వరరావు, వజ్జా జ్యోతిబసు, ఇమామ్, సిరాజ్, నూరుద్దీన్, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నాలక్ష్మీకుమారి, సత్రపల్లి సాంబశివరావు, దుర్‌ాగ్యల సుధాకర్, జక్కుల రాంబాబు, కోమరం గణేశ్ తదితరులు ఉన్నారు.