
ఇల్లెందు నుంచి కొత్త సర్వీసులు...
మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాలకు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రారంభం
ఇల్లెందు: ఇల్లెందు బస్‌డిపో నుంచి రెండు నూతన సర్వీస్‌లను ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం ప్రారంభించారు. ఇల్లెందు నుంచి మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాలకు నడిపే ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త సర్వీసులతో ప్రయాణికులకు ఉపయోగం ఉంటుందని అన్నారు. ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం, అశ్వాపురం మీదుగా మణుగూరు సర్వీస్, కొత్తగూడెం, చండ్రుగొండ, వీఎం బంజర మీదుగా సత్తుపల్లి సర్వీసు నడుస్తుందని తెలిపారు. డిపో మేనేజర్ ఎం.దేవేందర్‌గౌడ్ మాట్లాడుతూ త్వరలో ఇల్లెందు– భూపాలపల్లి సర్వీస్ కూడా ప్రారంభిస్తామన్నారు. ఇల్లెందు డిపోకు 8 కొత్త బస్సులు వచ్చాయని తెలిపారు. ఆర్టీసీ అధికారులు సునీత, శ్రీనివాస్, రాంనర్సయ్య, వేమూరి నాగరాజు, మాజీ కౌన్సిలర్లు కొక్కు నాగేశ్వరరావు, సయ్యద్ ఆజం, నవీన్, వారా రవి, మడుగు సాంబమూర్తి, చిల్లా శ్రీనివాస్, బోళ్ల సూర్యం, డానియేల్ పాల్గొన్నారు.