ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో వినిపిస్తున్నా..
● ఎంపీ రామసహాయం రంఘురాంరెడ్డి
ఖమ్మంవన్‌టౌన్: తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో వినిపిస్తూ, వాటి పరిష్కారం దిశగా పనిచేస్తున్నానని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమది తొలి నుంచి ప్రజలతో ముడిపడిన జీవితమని, మున్నేరు వరదలప్పుడు సైతం అనేక కాలనీల్లో సహాయక చర్యల్లో పాల్గొని, నిత్యావసరాలు పంపిణీ చేశానన్నారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా జాతీయ రహదారులు, సర్వీస్‌రోడ్లు, అండర్‌పాస్‌ల రూపకల్పనకు కృషిచేశానని, కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ అంశాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, తాను తిరిగి ఫైల్ తెరిపించి విమానయాన శాఖ అధికారులను సర్వేకు పిలిచానని పేర్కొన్నారు. పాలేరులో ప్రత్యామ్నాయ రైల్వే రూట్, పులిగుండాల ఎకో టూరిజం పార్క్, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలపై తాను గళం విప్పానని స్పష్టం చేశారు.
ఉపాధి కోసం వెళ్లి విగతజీవులుగా మారి..
● చోరీ ఘటనలో హత్యకు గురైన
వృద్ధ దంపతులు
ఇల్లెందురూరల్: మండలంలోని మాణిక్యారం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కనకయ్య, రాజమ్మ ఉపాధి కోసం హైదరాబాద్‌లోని ఆల్వాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అక్కడే అపార్ట్‌మెంట్ల వద్ద వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రాంబాబు, రమేష్ ఉన్నారు. చిన్న కుమారుడు ఉపాధి కోసం హైదరాబాద్‌కు మకాం మార్చడంతో వృద్ధ దంపతులు అతన్ని అనుకరిస్తూ అక్కడికే వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధ దంపతులను హత్య చేసి వారి వద్ద ఉన్న బంగారం, డబ్బులను అపహరించుకెళ్లారు. ఉపాధి కోసం వెళ్లి విఘత జీవులుగా మారడం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ కలప పట్టివేత
అశ్వాపురం: మండల పరిధిలోని అమెర్ద గ్రామంలో గోదావరి ఒడ్డున అక్రమంగా నిల్వ ఉంచిన కలపను ఆదివారం ఎఫ్‌ఆర్‌ఓ రమేష్ ఆధ్వర్యాన ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.1.20లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
బొగ్గు టిప్పర్ బోల్తా..
మణుగూరు టౌన్: బొగ్గు లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్‌కు పశువులు అడ్డుగా రావడంతో బోల్తా పడింది. ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను స్థానికుల ఇలా తెలిపారు. మణుగూరు నుంచి బీటీపీఎస్‌కు బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్‌కు మండలపరిధి రామానుజవరం ఊరి చివరన గేదెలు అడ్డుగా రావడంతో వాటిని తప్పించబోయే క్రమంలో పక్కనే కాల్వలోకి వెళ్లడంతో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎటువంటి ప్రమాదం జరగలేదు.
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
● భార్య మృతి.. భర్త, కుమార్తె
పరిస్థితి విషమం
ఏన్కూరు: బైక్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వివాహిత మృతిచెందగా.. ఆమె భర్త, కుమార్తె పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రామతండాకు చెందిన సొడియం బ్రహ్మ ఆయన భార్య సంధ్య, కూతురు అమృత కలిసి ద్విచక్రవాహనంపై ఏన్కూరు ప్రధాన సెంటర్‌కు రాగానే మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికులు 108 ద్వారా ముగ్గురిని ఆస్పత్రికి తరలిస్తుండగా సంధ్య (38) మృతి చెందింది. భర్త, కూతురు పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఘటనా స్థలానికి ఎస్‌ఐ రఫీ చేరకుని, కేసు నమోదు చేశారు.
ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో వినిపిస్తున్నా..
ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో వినిపిస్తున్నా..
ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో వినిపిస్తున్నా..
ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో వినిపిస్తున్నా..


