● మూడు, నాలుగు నెలలుగా తెలంగాణ, ఏపీ సరిహద్దు గ్రామాల్లో పనులు ● మిర్చి కోతలు చివరి దశకు చేరడంతో తిరిగి వెళ్తున్న ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసీలు ● విప్ప పూలు రాలే సీజన్‌ కావడంతో వడివడిగా గూడేల వైపు అడుగులు | - | Sakshi
Sakshi News home page

● మూడు, నాలుగు నెలలుగా తెలంగాణ, ఏపీ సరిహద్దు గ్రామాల్లో పనులు ● మిర్చి కోతలు చివరి దశకు చేరడంతో తిరిగి వెళ్తున్న ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసీలు ● విప్ప పూలు రాలే సీజన్‌ కావడంతో వడివడిగా గూడేల వైపు అడుగులు

Apr 4 2025 12:19 AM | Updated on Apr 4 2025 12:19 AM

● మూడ

● మూడు, నాలుగు నెలలుగా తెలంగాణ, ఏపీ సరిహద్దు గ్రామాల్లో

సరుకులు ఇక్కడి నుంచే..

ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ గ్రామాల్లో నిత్యావసర సరుకుల కొనుగోలుకు సరైన దుకాణాలు ఉండవు. ఈ నేపథ్యంలో తిరుగు ప్రయాణంలోనే ఆదివాసీలు వర్షాకాలం మొత్తానికి సరిపడా సరుకులను కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. దీంతో చర్లలోని దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. గత ఆదివారం కూడా చర్లలో జరిగిన వారపు సంతలో బియ్యం, నూకలు ఇతర నిత్యావసరాల విక్రయాలు పెద్ద ఎత్తున సాగాయి. ఆదివాసీ యువకులు మొబైల్‌ ఫోన్లు, రేడియోలు, వాచ్‌లు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. మిర్చి కోత పనులకు వలస వచ్చిన ఆదివాసీలు తిరిగి ఇళ్లకు చేరుకుంటుండటంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

మిర్చి కోతలు పూర్తి కావడంతో స్వగ్రామానికి వెళ్తున్న ఆదివాసీలు

డిసెంబర్‌, జనవరిలలో వచ్చి..

సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌, దంతెవాడ, సుకుమా జిల్లాల్లోని అటవీ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు స్వగ్రామాల్లో పనుల్లేక డిసెంబర్‌, జనవరి నెలల్లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు మిర్చి కోతల కోసం తరలివచ్చారు. తోటలకు సమీపంలోని వాగులు, నదులు, చెరువుల ఒడ్డునే తాత్కాలికి నివాసాలను ఏర్పాటు చేసుకుని మూడు, నాలుగు నెలలపాటు పనులు సాగించారు. రోజుకు రూ. 300 మేర కూలి చేసుకుంటూ ఒక్కొక్కరు రూ. 20 వేల నుంచి రూ. 22 వేల మేర సంపాదించుకున్నారు.

విప్ప పూలు రాలుతుండటంతో..

మిర్చి కోత పనులు చివరి దశకు చేరాయి. మరోవైపు ప్రకృతి సహజసిద్ధంగా లభ్యమయ్యే పంట విప్పపూలు రాలుతున్నాయి. దీంతో వాటిని ఏరుకుని విక్రయించునేందుకు ఆదివాసీలు తమ గ్రామాలకు తరలివెళ్తున్నారు. రైతులు ఏర్పాటు చేసిన వాహనాల్లో గూడేలకు తరలిపోతుండగా అటవీ ప్రాంత రహదారులు సందడిగా మారాయి. దగ్గర గ్రామాలవారు కాలినడకనే వెళ్తున్నారు. బీజాపూర్‌, సుకుమా, దంతెవాడ జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లే కుర్నపల్లి, తిప్పాపురం, పూసుగుప్ప రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి. వారం రోజుల నుంచి ఆదివాసీలు తిరిగి పయనమవుతున్నారు.

పోషణ కోసం పోరాటం

ప్రతీ సంవత్సరం మిర్చి కోతల సీజన్‌లో పనుల కోసం వస్తాం. పొట్టపోషణ కోసం మూడు, నాలుగు నెలల పాటు పిల్లల్ని, తల్లిదండ్రులను వదిలి వస్తాం. ఇక్కడ పని చేసి వచ్చిన డబ్బులతో వర్షాకాలానికి సరిపడా సరుకులన్నీ కొనుక్కొని వెళ్తాం.

–పొడియం సింగ, డోకుపాడు

పనుల్లేక ఇక్కడికి వచ్చాం

మా దగ్గర పనులు ఏమీ ఉండక పోవడం వల్ల పొరుగున ఉన్న ప్రాంతాలకు కూలి పనులకు పోతాం. ఏటా ఇదే మా జీవన విధానం. పనులు పూర్తవ్వడంతో ఇళ్లకు చేరి పిల్లలు, పెద్దలతో సంతోషంగా గడుపుతాం.

–కుంజం దేవి, తెట్టెమడుగు

● మూడు, నాలుగు నెలలుగా తెలంగాణ, ఏపీ సరిహద్దు గ్రామాల్లో1
1/2

● మూడు, నాలుగు నెలలుగా తెలంగాణ, ఏపీ సరిహద్దు గ్రామాల్లో

● మూడు, నాలుగు నెలలుగా తెలంగాణ, ఏపీ సరిహద్దు గ్రామాల్లో2
2/2

● మూడు, నాలుగు నెలలుగా తెలంగాణ, ఏపీ సరిహద్దు గ్రామాల్లో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement