జూలూరుపాడు: మండలంలోని కాకర్ల శ్రీ రుక్మిణీ సహిత సంతాన వేణుగోపాల స్వామివారిని శనివారం జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి దంపతులు దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీపీఓ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఢిల్లీ వెంకటేశ్వర్లు, పూజారి ఫణి రాజాచార్యులు, ఎంపీఓ తులసిరామ్, చెరుకుమల్లి కృష్ణయ్య, పొన్నెకంటి సతీష్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.