వేలంపాట నిర్వహించిన
పంచాయతీ అధికారులు
భద్రాచలంఅర్బన్: భద్రాచలం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆశీలు (పార్కింగ్), సంత, గోదావరి ఫెర్రీ, పంచాయతీ దుకాణాలకు శుక్రవారం వేలం పాట నిర్వహించారు. డీఎల్పీఓ సుధీర్, గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ సమక్షంలో వేలంపాట నిర్వహించగా, ఆశీలు కాంట్రాక్ట్‌ను రూ.1.25 కోట్లకు పట్టణానికి చెందిన రంగా అనే వ్యక్తి దక్కించుకున్నాడు. గత ఏడాది ఇదే టెండర్ 9 నెలలకుగాను రాములు అనే వ్యక్తి రూ.79 లక్షలకు దక్కించుకున్నాడు. గోదావరి నదిలో ఉండే బోట్లు (ఫెర్రీ) గతేడాది 9 నెలలకు రూ. 16.90 పలకగా, ఈసారి ఏడాదికి గాను రూ. 27లక్షల 25 వేలు పలికింది. చర్ల రోడ్డులో నిర్వహించే వారపు సంత గతేడాది 9 నెలలకు గాను రూ.3.90 లక్షలు పలకగా, ఈ ఏడాది రూ.3.80 లక్షలకు దక్కించుకున్నారు. చర్చి రోడ్డులో ఉన్న మొదటి దుకాణం, రూ.1.45 లక్షలు, రెండో దుకాణం రూ.1.32 లక్షలు పలికాయి. బ్రిడ్జి సెంటర్‌లో పార్క్ వద్ద ఉన్న షాప్ రూ.90 వేలు పలికింది. మొత్తంగా టెండర్ ప్రక్రియ ద్వారా గ్రామ పంచాయతీకి రూ.1,59,72,200 ఆదాయం సమకూరనుంది.